Manchu manoj: శివుని ఆజ్ఞ.. ఎమోషనల్ పోస్ట్

ABN, First Publish Date - 2023-03-05T14:11:04+05:30

మంచు మనోజ్‌. భూమా మౌనికా రెడ్డిల వివాహం ఇటీవల ఫిల్మ్‌నగర్‌లోని స్వగృహంలో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే! మొదట స్నేహితులుగా ఉన్న వీరిద్దకి మధ్య ప్రేమ చిగురించింది.

Manchu manoj: శివుని ఆజ్ఞ.. ఎమోషనల్ పోస్ట్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మంచు మనోజ్‌(Manchu manoj), భూమా మౌనికా రెడ్డిల ( Mounika reddy) వివాహం ఇటీవల ఫిల్మ్‌నగర్‌లోని స్వగృహంలో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే! మొదట స్నేహితులుగా ఉన్న వీరిద్దకి మధ్య ప్రేమ చిగురించింది. కుటుంబ సభ్యుల ఆశీస్సులతో పెళ్లి పీటలెక్కారు. వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. అయితే ఈ తంతు మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని తన స్వగృహంలోనే ఈ వేడుక జరిపించారు మంచు లక్ష్మీ (Manchu lakshmi prasanna).

మనోజ్‌ - మౌనికలకు ఇది రెండో వివాహం. మౌనికకు ధైరవ్‌ రెడ్డి (Dhairav Reddy) అనే కొడుకు ఉన్నాడు. తాజాగా మంచు మనోజ్‌ ఆసక్తికరమైన ఫోటో షేర్‌ చేశాడు. ఇందులో మౌనిక చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు మనోజ్‌. ఈ ఇద్దరి చేతులను ఓ ధైరవ్‌ తన హస్తాలతో పట్టుకున్నాడు. దీనికి ‘శివుని ఆజ్ఞ’ అని క్యాప్షన్‌ ఇచ్చారు మనోజ్‌. దీనితో మౌనికతోపాటు ధైరవ్‌ బాధ్యత కూడా నాదే అని మనోజ్‌ చెప్పకనే చెప్పాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. (Manoj weds mounika)

Updated Date - 2023-03-05T14:17:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising