ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Skydiving Video: స్కైడైవింగ్ సమయంలో షాకింగ్ అనుభవం.. తీరా విమానంలోంచి దూకుతుండగా ఊహించని విధంగా..

ABN, First Publish Date - 2023-10-24T18:26:06+05:30

పక్షిలా గాల్లో విహరిస్తూ ప్రకృతిని ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కొందరు ఈ సాహసాన్ని అవలీలగా చేసేస్తూ తమ కోరికను నెరవేర్చుకుంటుంటారు. అయితే అది అంత ఈజీ కాదు అనే విషయం కొన్ని ఘటనలు చూసినప్పుడు తెలిసిపోతుంటుంది. స్కైడైవర్లకు అప్పుడప్పుడూ...

పక్షిలా గాల్లో విహరిస్తూ ప్రకృతిని ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కొందరు ఈ సాహసాన్ని అవలీలగా చేసేస్తూ తమ కోరికను నెరవేర్చుకుంటుంటారు. అయితే అది అంత ఈజీ కాదు అనే విషయం కొన్ని ఘటనలు చూసినప్పుడు తెలిసిపోతుంటుంది. స్కైడైవర్లకు అప్పుడప్పుడూ ఊహించని ప్రమాదాలు ఎదురవుతుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు ఏకంగా ప్రాణాలే పోతే.. మరికొన్నిసార్లు చావు అంచులదాకా వెళ్లి వస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. స్కైడైవింగ్ చేసేందుకు గాల్లోకి వెళ్లి.. తీరా విమానం నుంచి దూకే సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏం జరిగిందంటే..

కొన్నేళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో (viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ తెగ వైరల్ అవుతోంది. స్కైడైవింగ్ (Skydiving) చేసేందుకు కొందరు విమానంలో (plane) ఆకాశంలోకి దూసుకెళ్లారు. చాలా ఎత్తుకు వెళ్లిన తర్వాత అక్కడి నుంచి కిందకు దూకేందుకు సిద్ధమయ్యారు. విమానం డోరు తెరచి కిందకు దూకే ప్రయత్నం చేశారు. మొదటగా ఓ వ్యక్తి బయటికి వెళ్లి విమానం కింది భాగంలోని ఇనుప రాడ్ పట్టుకుని ఉండగా.. మరో వ్యక్తి కూడా అతడికి ఎదురుగా వెళ్లాడు. తీరా వీరిద్దరూ కిందకు దూకే సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ విమానానికి దూరంలో ఉన్న మరో విమానం ఊహించని విధంగా దూసుకొచ్చింది.

Viral Video: వామ్మో! బీరు తయారీలో ఇలాక్కూడా చేస్తారా.. ఈ కంపెనీ సిబ్బంది దొంగచాటుగా ఏం చేస్తున్నారో చూడండి..

విమానం దూసుకురావడంతో కిందకు దూకుతున్న స్కైడైవర్లు దాని రెక్కలకు తగులుకుని అటు నుంచి అటే గాల్లో తలకిందులుగా పడిపోయారు. తర్వాత ఆ విమానం కాసేపు (plane went out of control) అదుపుతప్పి గాల్లోనే గింగిరాలు కొట్టింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, అంతా క్షేమంగా భూమి మీద ల్యాండ్ అయినట్లు తెలిసింది. కాగా, విమానం ఢీకొన్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! ఇది మరీ దారుణం’’.. అని కొందరు, ‘‘రోడ్డు మీదే అనుకుంటే.. ఆకాశంలోనూ ఇలాగే జరుగుతోందే’’.. అని మరికొందరు, ‘‘బాబోయ్! చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం పది లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పెద్ద జంతువును మింగి ప్రాణం మీదకు తెచ్చుకున్న కొండచిలువ.. కంచె దాటుతుండగా ఉన్నట్టుండి ఏం జరిగిందంటే..

Updated Date - 2023-10-24T18:26:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising