ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Slum Girl: బాలీవుడ్ హీరోయిన్లు అక్కర్లేదంటూ 14 ఏళ్ల బాలికను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుందో కంపెనీ.. ఇంతకీ ఈ అమ్మాయి కథేంటంటే..!

ABN, First Publish Date - 2023-05-22T14:25:38+05:30

ఓ కంపెనీ మాత్రం భిన్నంగా ఆలోచించింది. 'మాకు బాలీవుడ్ భామలు, టాలీవుడ్ భామలు అక్కర్లేదు.. మురికివాడల్లో నివసించే ఈ పిల్ల చాలు' అని ఫిక్సయిపోయారు. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఈ పిల్ల గురించే చర్చ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీవీలలో రోజూ ప్రసారమయ్యే లిప్ స్టిక్ యాడ్ నుండి రోజ్ వాటర్ యాడ్ వరకు ప్రతీ దానికి బాలీవుడ్ హీరోయిన్లు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటున్నారు. దుస్తులు, బ్యూటీ ఐటమ్స్, పాదరక్షలు ఇలా ఎన్నింటికో బాలీవుడ్ భామలు తళుక్కున మెరుస్తూ ఆయా ఉత్పత్తులను ప్రమోట్ చేస్తారు. అయితే ఓ కంపెనీ మాత్రం భిన్నంగా ఆలోచించింది. 'మాకు బాలీవుడ్ భామలు, టాలీవుడ్ భామలు అక్కర్లేదు.. మురికివాడల్లో నివసించే ఈ పిల్ల చాలు' అని ఫిక్సయిపోయారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. స్లమ్ ఏరియాలో ఉంటూ కంపెనీలనే ఆకర్షించిన ఆ అమ్మాయి ఎవరు? ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి పూర్తీగా తెలుసుకుంటే..

ముంబైలోని(Mumbai) ధారవి స్లమ్(Dharavi slum) లో 14ఏళ్ళ మలీషా ఖర్వా(Maleesha Kharwa) అనే బాలిక నివసిస్తోంది. ఆ అమ్మాయి, ఆమె కుటుంబం, ఆమె చుట్టు ప్రక్కల వారు అందరూ మురికి వాడలో సరైన సౌకర్యాలు లేని చోట ఉంటున్నారు. ఆమెను మొట్టమొదటగా హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్ మన్(Hollywood Actor Robert Half men) గుర్తించారు. ఆయన ఆ అమ్మాయికి సహాయం చెయ్యడానికి 'గో ఫండ్ మీ'(Go fund me) పేజీని కూడా ఏర్పాటుచేశారు. ఈ సంఘటన తరువాత మలీషా సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఆమె సహజసౌందర్యాన్ని చూసి ఎన్నో మోడలింగ్ అసైన్మెంట్లు(Modeling assignment) ఆమె చెంతకు చేరాయి. 'లివ్ యువర్ ఫెయిరీ టేల్'(live your fairy tale) అనే షార్ట్ ఫిలిమ్ లో కనిపించింది. ఈ అమ్మాయిని అందరూ 'ప్రిన్సెస్ ఆఫ్ ది స్లమ్'(Princess of the slum) అని పిలవడం మొదలెట్టారు. మూడేళ్ళ కిందట 'ద యువతి కలెక్షన్'(The Yuvathi Collection) పేరుతో ఒక బ్రాండ్ కు అంబాసిడర్ గా ఈ అమ్మాయి పనిచేసింది. ఈ అమ్మాయి గురించి తెలుసుకున్నఓ లగ్జరీ బ్యూటీ బ్రాండ్ ఆమెను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది. 'ఫారెస్ట్ ఎసెన్షియల్' అనే బ్రాండ్ తమ బ్యూటీ ఉత్పత్తిని మలీషాతో ప్రమోట్ చేయించింది. తమ బ్యూటీ ఉత్పత్తులకు సంబంధించిన షోరూమ్ ను మలీషా సందర్శించిన వీడియోను సదరు బ్రాండ్ షేర్ చేసింది. వీడియోలో మలీషా షోరూమ్ లోకి వెళ్ళి తన ఫోటోలు, తన గురించి అందులో పొందుపరిచిన విషయాలు చూసి చాలా సంతోషించింది.

Viral Video: బైక్ మీద వెళ్ళే టప్పుడు వెధవ్వేషాలు వెయ్యకూడదు అనేది ఇందుకే.. యమా జోష్ గా వెళుతున్న ఈ కుర్రాళ్ళకు ఏం జరిగిందో మీరే చూడండి..


'తను కన్న కల నిజమయ్యాక దాన్ని చూసేందుకు ఆ అమ్మాయి ముఖం సంతోషంతో వెలిగిపోయింది.. కలలు నిజంగా నిజమవుతాయని మలీషా కథ అందరికీ గుర్తుచేస్తుంది' అంటూ క్యాప్షన్ మెన్షన్ చేశారు. forestessentials తమ ఇన్స్టాగ్రామ్ పేజీ(Instagram page) నుండి ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మలీషాను ప్రోత్సహించినందుకు సదరు బ్రాండ్ ని మెచ్చుకుంటున్నారు. 'ఆ అమ్మాయి ఎంత సంతోషంగా ఉందో ఆమె ముఖం చూస్తే ఇట్టే అర్థమవుతోంది' అని అంటున్నారు. 'ప్రతి బ్రాండ్ కు అంబాసిడర్ గా బాలీవుడ్ ప్రముఖులను చూసి చూసి విసిగిపోయాం, ఇప్పుడీ అమ్మాయిని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది' అని కామెంట్స్ చేస్తున్నారు. 'పేద కుటుంబాలలో పిల్లలకు ఇలా అవకాశాలు ఇవ్వడం ద్వారా ఎంతో మంది పిల్లల భవిష్యత్తులు బాగుపడతాయి' అని మరొకరు అన్నారు. 'మలీషా ఇలాగే ఉండిపోకుండా స్కూల్ కు వెళ్ళి మంచి విద్యావంతురాలు అవుతుందని కోరుకుంటున్నాను' అని మరొకరు అన్నారు.

Face Wash: ఖరీదైన ఫేస్ వాష్ లు అక్కర్లేదు.. ఈ ఒక్కటీ ఉపయోగించి ముఖం కడుక్కుంటే చందమామలా మారడం ఖాయం..


Updated Date - 2023-05-22T14:25:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising