ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Snake Video: చిన్న పామే అని తేలిగ్గా తీసుకోవద్దండోయ్.. అంత పెద్ద గుడ్డును.. ఈ చిన్న పాము ఎలా మింగేసిందో చూస్తే..!

ABN, First Publish Date - 2023-09-15T15:00:46+05:30

జరజర పాకిపోయే ఈ పాములు సాధారణంగా మనుషుల కనుసన్నల్లో ఎక్కువసేపు ఉండవు. దాంతో పాములు ఆహారం తీసుకోవడం, అవి దైన్నైనా మింగడం చూసినవారు తక్కువ. కానీ ఈ పాము గుడ్డు మింగుతున్న విధానం చూస్తే..

పాములు ఈ ప్రపంచంలో ఉన్న ప్రాణులలో జుగుప్స కలిగించే జీవులు. వీటిలో విషపూరితమైనవి, విషపూరితం కానివి అని రెండు వర్గాలు ఉన్నాయి. విషపూరితమైన పాము ఒక్క కాటు వేసిందంటే చాలు. ప్రాణాలు చాలా తొందరగా గాలిలో కలిసిపోతాయి. జరజర పాకిపోయే ఈ పాములు సాధారణంగా మనుషుల కనుసన్నల్లో ఎక్కువసేపు ఉండవు. దాంతో పాములు ఆహారం తీసుకోవడం, అవి దైన్నైనా మింగడం చూసినవారు తక్కువ. కానీ ఓ చిన్న పాముకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ పాము చాలా చిన్నగా ఉంది. కానీ దాని ముందు ఓ పెద్ద గుడ్డును ఉంచేసరికి దాన్ని క్షణాల్లోనే చాలా సులువుగా మింగేసింది. దీన్ని చూసిన నెటిజన్ల గుండె ఝల్లుమంటోంది. ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..

పాము(Snake) అనే మాటలోనే ఒక భయం దాగుంది. పాములకు విచక్షణ లేకపోవడం కూడా పాములంటే భయపడటానకి కారణం. కానీ కొందరు పాములతో సావాసం చేస్తారు. వాటిని పెంపుడు జంతువుల్లా పెంచుకుంటారు. చేత్తో పట్టుకుంటారు. ముద్దు చేస్తారు. ఈ మధ్య కింగ్ కోబ్రాకు షాంపూతో ఓ వ్యక్తి స్నానం చేయిస్తున్న వీడియో బాగా వైరల్ అయింది. ఇప్పుడు పాముకు సంబంధించిన మరొక వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వీడియోలో ఒక వ్యక్తి తన అరచేతిలో గుడ్డు పట్టుకున్నాడు. అతని చేతిమీద పాకుతూ ఆ గుడ్డు వద్దకు ఓ చిన్న పాము వచ్చింది. ఆ పాము తల ఆ గుడ్డుతో పోలిస్తే చాలా చిన్నది. కానీ పాము గుడ్డును కాస్త వాసన చూసి వెంటనే దాని నోరు తెరచి మెల్లగా గుడ్డును మింగుతుంది(small snake swalllow big egg). అంత పెద్ద గుడ్డును క్షణాల్లోనే పూర్తిగా మింగేస్తుంది. గుడ్డు మింగుతున్న సమయంలో పాము నోరు పెద్దగా సాగడం చూస్తే గుండె ఝల్లుమంటుంది.

Best School: ఈ స్కూల్‌లో పిల్లలు డబ్బులు కట్టనక్కర్లేదు.. ఖాళీ ప్లాస్టిక్ బాటిల్స్‌ను ఫీజుగా తీసుకుంటారట..!



ఈ వీడియోను Science girl అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీని గురించి పలువిధాలుగా కామెంట్ చేస్తున్నారు. 'సహజంగానే పాములు తమకంటే పెద్ద జీవులను మింగగలవు' అని ఒకరు కామెంట్ చేశారు. 'భారీ పాములు అయితే మనుషులను కూడా అదేవిధంగా మింగుతాయి' అని మరొకరు ఇంకాస్త భయపెట్టారు. 'అదేదో కుక్కకో, పిల్లికో బిస్కెట్ ఇచ్చినట్టు పాముకు గుడ్డు ఇస్తున్నాడు మహానుభావుడు' అని ఇంకొకరు ఆ వ్యక్తి చేసతున్న పనిని విమర్శిస్తున్నారు.

Marriage Tips: అమ్మాయిలూ.. పెళ్లి చూపుల్లోనే అబ్బాయిని ఈ ప్రశ్న అడిగేయండి.. ఇలా చెప్పినోళ్లనే పెళ్లాడండి..!


Updated Date - 2023-09-15T15:00:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising