Snake vs Monkey: కోతి చేష్టలంటే ఇవే మరి.. పడగవిప్పి బుసలు కొడుతున్నా.. పాము తోకను పదే పదే లాగుతున్న కోతి.. చివరకు..!

ABN, First Publish Date - 2023-05-24T18:16:01+05:30

ఓ కోతి చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఓ కోతి పడగవిప్పి బుసలు కొడుతున్న పాము దగ్గరకు వెళ్ళింది. దాని తోకను పట్టుకుని పదేపదే లాగింది. పాముకు, కోతికి మధ్య జరిగిన సంఘటన చూసి నెటిజన్లు షాకవుతున్నారు

Snake vs Monkey: కోతి చేష్టలంటే ఇవే మరి.. పడగవిప్పి బుసలు కొడుతున్నా.. పాము తోకను పదే పదే లాగుతున్న కోతి.. చివరకు..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోతి చేసే పనుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటి సరదా కాస్తా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. సరదాగా కనిపించే ఎన్నో సంఘటనలతో ప్రమాదాన్ని వెంటపెట్టుకొస్తుంది. ఓ కోతి చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఓ కోతి పడగవిప్పి బుసలు కొడుతున్న పాము దగ్గరకు వెళ్ళింది. దాని తోకను పట్టుకుని పదేపదే లాగింది. పాముకు, కోతికి మధ్య జరిగిన సంఘటన చూసి నెటిజన్లు షాకవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

'పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం' అనే మాట వినే ఉంటారు. పిల్లి సరదాగా వేటాడితే ఎలుక మాత్రం ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుతుంది. ఇక్కడ అలాంటి సీన్ లేకపోయినా కోతి(Monkey) సరదా కాస్తా పాముకు(Snake) ఇబ్బందిగా మారింది. వీడియోలో పంట పొలం(farm)లో ఒకపాము పడగ విప్పి బుసలు కొడుతోంది. పాము ఎదురుగా ఓ కోతి ఉంది. ఆ కోతి పాము తోక పట్టుకుని లాగుతుంది(Monkey drag snake tail). పాము తన తోక లాగుతున్న కోతిని కాటెయ్యడానికి వెళ్ళగా కోతి తప్పించుకుని వెనక్కు వెళుతుంది. ఆ తరువాత మళ్ళీ ఆ కోతి ముందుకు వెళ్ళి పాము తోక పట్టుకుని జరజరా లాక్కుపోయింది. పాము మళ్ళీ కోతికి కాటు వెయ్యడానికి ప్రయత్నించినా కోతి అప్పటికే పాముకు అందనంత దూరం వెళ్ళిపోయింది. ఆ తరువాత మళ్ళీ కోతి పాము తోక పట్టుకోవడానికి ముందుకు వస్తుండగా వీడియో ముగుస్తుంది. చివరకు ఆ కోతి, పాములలో ఏది అక్కడినుండి జంప్ అయ్యిందో, కోతికి ఏదైనా ప్రమాదం జరిగిందో తెలీలేదు.

Viral Video: ఐఏఎస్ అధికారి పోస్ట్ చేసిన వీడియో.. సైకిల్‌పై స్కూలుకు వెళ్తూ సడన్‌గా రోడ్డు పక్కన ఆగి.. ఈ పిల్లాడు చేసిన పనేంటో చూస్తే..!


ఈ వీడియోను shnoyakam అనే ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కోతి చేసిన పనికి దాని మీద మండిపడుతున్నారు. 'పాముతో చెలగాటం ఆడటమంటే ప్రాణాలమీదకు తెచ్చుకున్నట్టే' అని అంటున్నారు. 'పాములు విషపూరితమైనవనే విషయం కోతులకు తెలుసా?' అని మరొకరు సందేహం వ్యక్తం చేశారు. 'కోతిగారూ.. చావును ఆహ్వానిస్తున్నారు ఎందుకు?' అని మరొకరు అన్నారు.

Viral Video: థియేటర్‌కు వెళ్లిన భార్యాభర్తలు.. సినిమా పూర్తయ్యాక ఏం చేస్తున్నారో చాటుగా వీడియో తీశాడో వ్యక్తి.. నెట్టింట పోస్ట్ చేస్తే..!


Updated Date - 2023-05-24T18:16:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising