ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్‌.. చనిపోయిన తల్లి వాయిస్‌ వినిపించడంతో అతడికి షాక్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ABN, First Publish Date - 2023-07-16T10:36:32+05:30

ఓ వ్యక్తికి గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్‌ వచ్చింది. తీరా.. ఫోన్ తీసి మాట్లాడితే చనిపోయిన తన తల్లి వాయిస్‌ వినిపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Shocking: ఓ వ్యక్తికి గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్‌ వచ్చింది. తీరా.. ఫోన్ తీసి మాట్లాడితే చనిపోయిన తన తల్లి వాయిస్‌ వినిపించింది. దాంతో అతడు షాక్ అయ్యాడు. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామంతో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ. 60.35లక్షలు పొగొట్టుకున్నాడు. అసలు ఆ వ్యక్తికి ఫోన్ చేసింది ఎవరు? అతడు అంత భారీ మొత్తం ఎలా కోల్పోయాడు? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నార్తాంప్టన్‌షైర్ (Northamptonshire) పరిధిలోని స్టానియన్‌కు చెందిన డేనియల్ కత్‌బర్ట్ (Daniel Cuthbert) అనే వ్యక్తి తన తండ్రి పేరు మీద ఇంటికి కోసం బ్యాంకులో హోంలోన్ తీసుకున్నాడు. కానీ, లోన్ తిరిగి చెల్లించే మార్గం లేక మళ్లీ అప్పులు చేశాడు. ఈ క్రమంలో చేసిన అప్పులు తిరిగి చెల్లించేందుకు ఏకంగా తన తండ్రినే బోల్తా కొట్టించాడు. తండ్రి ఖాతాలో ఉన్న డబ్బుపై కన్నేసిన డేనియల్ కొత్త ఉపాయం ఆలోచించాడు. మొదట తన బామ్మ వాయిస్‌తో తండ్రికి ఫోన్ చేశాడు. అతడు నిజంగా తన తల్లి గొంతులానే ఉండడంతో ఆశ్చర్యపోయాడు. అంతకు కొన్ని నెలల ముందే ఆమె చనిపోయింది. కానీ, అచ్చం ఆమె వాయిసే ఉండడంతో అసలు మాట్లాడింది ఎవరో అతనికి అర్థం కాలేదు. అలా తన తండ్రి నమ్మినట్లు నిర్ధారించుకున్నాక.. అదే గొంతుతో లాయిడ్స్ బ్యాంక్ కాల్ హ్యాండ్లర్‌లకు ఫోన్ చేశాడు. వారు డేనియల్ వాయిస్ అచ్చం అతని బామ్మలానే ఉండడంతో నమ్మేశారు. ఆ తర్వాత బ్యాంకు వాళ్లను మనీ ట్రాన్స్‌ఫర్ కోసం అడిగాడు.

Gurdeep Kaur Chawla: ఎవరీ మహిళ..? ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారంటే చాలు.. పక్కన ఈమె ఉండాల్సిందే..!


దాంతో వారు ఖాతా ఓపెనింగ్ సమయంలో సెట్ చేసిన సెక్యూరిటీ కొశ్చన్స్‌కు సమాధానాలు అడిగారు. వాటన్నింటికీ మనోడు కరెక్ట్‌గానే జవాబులు చెప్పేశాడు. అలా డేనియల్ తొమ్మిదిసార్లు ఫోన్ చేసి, తండ్రి ఖాతా నుంచి సుమారు రూ. 60.35లక్షలు తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు. ఇక ఉన్నట్టుండి తన ఖాతాలోని భారీ మొత్తంలో డబ్బులు మాయం కావడంతో తండ్రికి అనుమానం వచ్చి బ్యాంకు వాళ్లను అడిగాడు. అప్పుడు వాళ్లు అసలు విషయం చెప్పారు. మీ తల్లి ఫోన్ చేసి చెబితేనే ఒక ఖాతాకు బదిలీ చేశామని చెప్పడంతో అతడు షాకయ్యాడు. దాంతో వారి వద్ద నుంచి ఆ ఖాతా వివరాలను తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు డేలియల్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన బామ్మ గొంతుతో మాట్లాడి, తండ్రి ఖాతా నుంచి తన అకౌంట్‌లోకి డబ్బులు బదిలీ చేసుకున్నట్లు డేనియల్ ఒప్పుకున్నాడు. దాంతో అతడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.

Snake: పాముకు జన్మనిచ్చిన మహిళ.. వైరల్‌గా మారిన వీడియోలు.. ఇది నిజమేనా అని డాక్టర్లను కలిసి అడిగితే..!

Updated Date - 2023-07-16T10:36:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising