ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే.. ఓ వ్యక్తి చెవిలో సాలీడు ఎలా తిరుగుతోందో చూడండి.. వీడియో వైరల్!

ABN, First Publish Date - 2023-07-19T16:28:30+05:30

పొరపాటున ఏదైనా చిన్న పురుగు చెవిలోకి వెళ్లిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాటలతో చెప్పలేం. చెవి పోటుతో ఆ వ్యక్తి పడే బాధ వర్ణనాతీతం. అలాంటిది ఓ పెద్ద సాలీడు చెవిలోకి వెళ్లిపోయి లోపల తిరుగుతూ గూడు కట్టేస్తే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది? ఊహించడానికే భయంకరంగా ఉంది కదూ..

పొరపాటున ఏదైనా చిన్న పురుగు చెవి (Ear)లోకి వెళ్లిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మాటలతో చెప్పలేం. చెవి పోటు (Ear Pain)తో ఆ వ్యక్తి పడే బాధ వర్ణనాతీతం. అలాంటిది ఓ పెద్ద సాలీడు (Spider) చెవిలోకి వెళ్లిపోయి లోపల తిరుగుతూ గూడు కట్టేస్తే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది? ఊహించడానికే భయంకరంగా ఉంది కదూ.. చైనా (China)కు చెందిన ఓ వ్యక్తికి అలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ వ్యక్తి చెవిలోకి వెళ్లిన సాలీడు లోపల ఏకంగా గూడు కట్టేసింది (Spider in the ear). ఆ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

చైనాకు చెందిన ఓ వ్యక్తి నిద్రిస్తూ ఉండగా అతడి చెవిలోకి ఓ సాలీడు వెళ్లిపోయింది. తర్వాతి రోజు ఆ వ్యక్తికి విపరీతంగా చెవినొప్పి వచ్చింది. దీంతో అతడు డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. పరీక్షించిన డాక్టర్ చెవి లోపల సాలీడు తిరుగుతున్నట్లు కనుగొన్నారు. అది చెవిలోపల వేగంగా సాలె గూడు (Spider Net)ను అల్లేస్తోంది. ఆ సాలీడును మైక్రోస్కోపిక్ వ్యూ ద్వారా డాక్టర్లు కనుగొన్నారు. చెవి లోపల సాలీడు గూడు కట్టడం చూసి డాక్టర్లు కూడా ఒక్క క్షణం షాకయ్యారు. తర్వాత ఆ సాలీడును బయటకు తీశారు.

Viral Video: కాపాడినందుకు థ్యాంక్స్.. బావిలో పడిన ఏనుగును కాపాడిన సిబ్బంది.. వీడియో వైరల్!

dailymail ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``చాలా భయంకరంగా ఉంది``, ``ఊహించడానికే కష్టంగా ఉంది``, ``ఇది చూసిన తర్వాత నిద్రపోవడం కష్టమవుతుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-19T16:28:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising