ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SS Rajamouli: ఆ స్క్రిప్ట్ చదివి ఏడ్చేశా

ABN, First Publish Date - 2023-02-17T15:13:33+05:30

బాహుబలి’ ప్రాంచైజీతో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న దర్శకుడు యస్‌యస్. రాజమౌళి (SS. Rajamouli). తాజాగా ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘బాహుబలి’ ప్రాంచైజీతో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న దర్శకుడు యస్‌యస్. రాజమౌళి (SS. Rajamouli). తాజాగా ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఆస్కార్ బరిలోను నిలిచింది. ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేషన్ దక్కించుకుంది. ఆస్కార్ పురస్కారాలు దగ్గరపడిన తరుణంలో జక్కన్న హాలీవుడ్‌లో ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తన తండ్రి రాసిన ఓ స్క్రిఫ్ట్‌ను చదివి ఏడ్చేశానని రాజమౌళి ఈ సందర్భంగా చెప్పారు.

రాజమౌళి తెరకెక్కించిన అన్ని సినిమాలకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాదే (Vijayendra Prasad) రచయితగా వ్యవహరించారు. విజయేంద్ర ప్రసాద్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్‌ఎస్) (RSS) పై స్క్రిఫ్ట్‌ను రాస్తున్నారు. ఈ స్క్రిఫ్ట్ గురించి అడగగా జక్కన్న స్పందించారు. ‘‘ఆర్ఎస్‌ఎస్ చరిత్ర గురించి నాకు తెలియదు. అది ఓ సంస్థ అని మాత్రమే నాకు తెలుసు. ‘అది ఏ విధంగా ఏర్పడింది. ఆ సంస్థ భావజాలం ఏంటీ..? అది ఆ విధంగా నమ్మకాన్ని ఏర్పరచుకోవడానికి కారణం ఏంటీ..?’ అనే విషయాలు నాకు తెలియదు. కానీ, మా నాన్న రాసిన ‘ఆర్ఎస్‌ఎస్’ స్క్రిఫ్ట్‌ను చదివి నేను ఏడ్చేశాను. ఆ కథలో చాలా భావోద్వేగాలు ఉన్నాయి. నేను ‘ఆర్ఎస్‌ఎస్’ సినిమాకు దర్శకత్వం వహిస్తానో లేదో నాకు తెలియదు. మా నాన్న ఆ స్క్రిఫ్ట్‌ను ఎవరి కోసం రాశారు అనే సమాచారం నా వద్ద లేదు. కానీ, ఆ స్క్రిఫ్ట్‌ను తెరకెక్కించే అవకాశం వస్తే గౌరవంగా భావిస్తాను’’ అని రాజమౌళి పేర్కొన్నారు. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్.. ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్‌పై పనిచేస్తున్నారు. ‘పవన్ పుత్ర భాయిజాన్’ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. ‘ఆర్ఆర్ఆర్ 2’, ‘ఎస్ఎస్‌ఎమ్‌బీ29’ స్క్రిఫ్ట్‌లను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు.

Updated Date - 2023-02-17T15:29:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising