RRR: సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజమౌళి..!
ABN, First Publish Date - 2023-02-28T18:47:43+05:30
టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.
టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ ఆస్కార్ నామినేషన్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. అకాడమీ అవార్డ్స్ తేదీ దగ్గరపడటంతో రాజమౌళి విదేశాల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మత విశ్వాసాలు ఉన్న కుటుంబంలోనే పెరిగినప్పటికీ తాను నాస్తికుణ్ని అని చెప్పారు. మతం అనేది ఓ దోపిడీ అని పేర్కొన్నారు.
‘‘.. ‘ఆర్ఆర్ఆర్’ అనేది జాతీయవాదాన్ని పెంపొదించే చిత్రం కాదు. నాకు సినిమాల విషయంలో ఎటువంటి ఎజెండా లేదు. ప్రజలు కష్టపడి సంపాదించిన మొత్తాన్ని టిక్కెట్స్ కోసం వెచ్చిస్తున్నారు. నేను వారి కోసమే చిత్రాలను తెరకెక్కిస్తాను. వారిని ఎంటర్‌టైన్ చేయడానికి కష్టపడతాను. నా చిత్రంలోని సంఘటనలు, పాత్రల ద్వారా వారు భావోద్వేగాలకు గురయ్యేలా చేస్తాను. నేను ఎప్పుడైనా సినిమాకు వెళ్లాలనుకుంటే లార్జర్ దేన్ లైఫ్ పాత్రలను, సంఘటనలను, డ్రామాలను చూడటానికి ఇష్టపడతాను. ప్రస్తుతం మేం కొత్త బాటలో ప్రయాణిస్తున్నాం. అయినప్పటికీ, బుడి బుడి అడుగులే వేస్తున్నాం. ఉదాహరణకు దక్షిణ కొరియాను చూడండి. వారు కొత్త రకం సినిమాలను రూపొందిస్తున్నారు. అదే బాటలో ఇండియన్ ఫిలిమ్ మేకర్స్ అందరు ప్రయణించాలి’’ అని రాజమౌళి పేర్కొన్నారు.
ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డును సొంతం చేసుకుంది. అకాడమీ అవార్డ్ కోసం ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీపడుతుంది. ఈ పురస్కారాలను మార్చి 13న ప్రదానం చేయనున్నారు.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఇవి కూడా చదవండి:
Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..
RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్
Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్
Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!
Updated Date - 2023-02-28T18:47:43+05:30 IST