SBI Net Banking: నెట్ బ్యాంకింగ్ లేదా? ఎస్‌బీఐ ఖాతాదారులూ ఇంటి దగ్గరే ఉండి ఈజీగా యాక్టివేట్ చేసుకోండిలా...
ABN, First Publish Date - 2023-04-30T21:29:28+05:30
ఎస్‌బీఐ ఖాతాదారులైతే ఒక్కసారి రిజిస్టర్ అయితే ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ సౌలభ్యాన్ని మొబైల్స్, పీసీలు లేదా ఎలక్ట్రానిక్ డివైజులపై పొందొచ్చు. నెట్ బ్యాంకింగ్ సర్వీసు కోసం ఖాతాదారులు సులభంగా సులభంగా రిజిస్టర్ అవ్వొచ్చు. బ్రాంచ్‌కు వెళ్లకుండానే రిజిస్టర్ చేసుకోవచ్చు.
భారత్‌లో డిజిటలైజేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. ముఖ్యంగా కరోనా అనంతరం మరింత ఊపందుకుంది. ఫలితంగా జనాలు ఆన్‌లైన్ సర్వీసులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం నుంచి మొబైల్స్ సహా ఎలక్ట్రిక్ వస్తువుల కొనుగోలుకు ఆన్‌లైన్ సేవలకే మొగ్గుచూపుతున్నారు. బ్యాంకింగ్ సర్వీసులను ఉపయోగించి పేమెంట్లు చేస్తున్నారు. ఇందుకోసం మొబైల్‌పై లభ్యమయ్యే అన్ని సర్వీసులతోపాటు నెట్ బ్యాంకింగ్‌ను వాడుతున్నారు.
ఇలాంటి సేవలను ఉపయోగించుకునే ఎస్‌బీఐ ఖాతాదారులైతే ఒక్కసారి రిజిస్టర్ అయితే ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ సౌలభ్యాన్ని మొబైల్స్, పీసీలు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా పొందొచ్చు. నెట్ బ్యాంకింగ్ సర్వీసు కోసం ఖాతాదారులు సులభంగా సులభంగా రిజిస్టర్ అవ్వొచ్చు. బ్రాంచ్‌కు వెళ్లకుండానే రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఎస్‌బీఐ నెట్‌బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఇలా..
Step 1: ఎస్‌బీఐ వెబ్ పోర్టల్ ttps://retail.onlinesbi.sbi/retail/login.htm ను సందర్శించాలి.
Step 2: ‘పర్సనల్ బ్యాంకింగ్’ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ‘కంటిన్యూ టు లాగిన్’ బటన్‌పై క్లిక్ చేయాలి. తద్వారా ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగానికి సంబంధించిన టర్మ్స్, కండీషన్స్ అంగీకరించినట్టు.
Step 3: ‘న్యూ యూజర్? రిజిస్టర్ హియర్/యాక్టివేట్’పై క్లిక్ చేయాలి.
Step 4: ‘న్యూ యూజర్ రిజిస్ట్రేషన్’పై క్లిక్ చేయాలి.
Step 5: రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఎస్‌బీఐ అకౌంట్ నంబర్, సీఐఎఫ్ నంబర్, బ్రాంచ్ కోడ్, కంట్రీ (దేశం), రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ వివరాలతోపాటు క్యాప్చా కోడ్ నింపాలి.
Step 6: ‘ఫుల్ ట్రాన్షాక్షన్ రైట్స్’ సెలెక్ట్ చేసుకోవాలి. ‘ఐ అగ్రీ’పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కొనసాగించేందుకు ‘సబ్మిట్’పై క్లిక్ చేయాలి.
Step 7: ఆ తర్వాత రిజిష్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత ‘కన్ఫార్మ్’ మీద క్లిక్ చేయాలి.
Step 8: ఆప్షన్స్ అన్నీ పూర్తయిన తర్వాత రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ‘I have my ATM card’ మరియు ‘I do not have my ATM card’ అని ఉంటాయి. అందులో మొదటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఏటీఎం కార్డ్ వివరాలు నింపాలి. ఎస్‌బీఐ ఏటీఎం కార్డ్ ఉంటే మాత్రమే నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్‌ను ఆన్‌లైన్ చేయడం సాధ్యపడుతుంది. లేదంటే మీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
Step 9: సబ్మిట్‌పై క్లిక్ చేస్తే స్ర్కీన్ మీద టెంపరరీ యూజర్ పేరు కనిపిస్తుంది.
Step 10: రిజిస్టర్ అయ్యేందుకు నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
Step 11: రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత.. ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. టెంపరరీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఉపయోగించిన లాగిన్ అవ్వాలి.
Step 12: పర్మినెంట్ యూజర్ నేమ్ (user name), పాస్‌వర్డ్ (password) ఫిక్స్ చేసుకోవాలి.
ఏటీఎం కార్డు లేని యూజర్లకు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కి అప్లై చేసుకోవాలంటే ఎస్‌బీఐ వెబ్‌సైట్ నుంచి రిజిస్ట్రేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తి వివరాలతో నింపిన ఫామ్‌ను బ్యాంక్ అకౌంట్ కలిగివున్న బ్యాంక్ బ్రాంచ్ వద్ద సమర్పించాలి. బ్యాంక్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎలా చేయాలో సూచిస్తారు. ప్రక్రియ పూర్తయ్యాక ఇంటర్నెట్ బ్యాంకింగ్ కిట్ అందిస్తారు.
Updated Date - 2023-04-30T21:33:50+05:30 IST