Viral Video: వధువుపై అతి ప్రేమ కురిపించిన వరుడు.. ఎవరి దిష్టి తగలొద్దంటూ అందరి ముందూ అతడు చేసిన పని..
ABN, First Publish Date - 2023-04-28T15:54:20+05:30
పెళ్లిళ్ల సమయంలో చోటు చేసుకునే పలు ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. సాధారణంగా వివాహ సమయాల్లో అందమైన వధూవరులను చూసి..
పెళ్లిళ్ల సమయంలో చోటు చేసుకునే పలు ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. సాధారణంగా వివాహ సమయాల్లో అందమైన వధూవరులను చూసి.. ఈడు జోడు బాగుందంటూ అతిథులు చర్చించుకోవడం చూస్తుంటాం. అలాగే మరికొందరు ఓ అడుగు ముందుకేసి.. వారికి దిష్టి తీయడం కూడా చూస్తుంటాం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో వివాహ వేదికపై వరుడు విచిత్రమైన పని చేశాడు. వధువుపై అతి ప్రేమ కురిపించిన అతను.. ఎవరి దిష్టి పడకూడదంటూ చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు (bride and groom) అందంగా ముస్తాబై వేదికపై నిలబడి ఉంటారు. అయితే ఆ సమయంలో వరుడు ఉన్నట్టుండి చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోతున్న వధువును చూసి వరుడు ఫిదా అయిపోతాడు. వెంటనే ఆమెపై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తాడు. ‘‘ఎంత మంది కళ్లు పడ్డాయో.. వెంటనే దిష్టి తీయాలి’’.. అని అనుకుంటూ ఓ నల్ల వస్త్రం తీసుకుని.. ‘‘ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి’’.. అంటూ ఆమె ముందు నిలబడి దిష్టి తీస్తాడు.
వరుడు చేస్తున్న పనికి వధువు ఎంతో మురిసిపోతుంది. ఇతడి ప్రవర్తన చూసి అతిథులంతా ఒక్కసారిగా అవాక్కవుతారు. ‘‘ఇదే ప్రేమ జీవితాంతం చూపిస్తే.. ఇంకా ఆనందపడతాం’’.. అనుకుంటూ బంధువులంతా చర్చించుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఈ జంట చూడముచ్చటగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి భర్త ఉంటే భార్యకు ఏ సమస్యలూ ఉండవు’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో లైకులను సొంతం చేసుకుంది.
Viral Vdeo: ఇదేం పిచ్చిరా నాయనా.. మనిషిని ఎత్తుకుని డాన్స్ చేయడం చూశాం గానీ.. మరీ ఇలా ఏకంగా..
Updated Date - 2023-04-28T21:01:27+05:30 IST