ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Marriage Tradition: బాబోయ్.. చైనాలోని పెళ్లిళ్లలో వింత ఆచారం.. వధువు కోసం వస్తున్న వరుడిని నడిరోడ్డుపై ఆపి మరీ..!

ABN, First Publish Date - 2023-11-01T18:57:42+05:30

వివాహ కార్యక్రమాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుగుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఆచార సాంప్రదాయలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. వరుడిని వధువు తరపు స్నేహితులు, బంధువులు.. ఆట పట్టించడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ప్రస్తుతం...

వివాహ కార్యక్రమాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుగుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఆచార సాంప్రదాయలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. వరుడిని వధువు తరపు స్నేహితులు, బంధువులు.. ఆట పట్టించడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, చైనాలోని పెళ్లిళ్లలో వింత ఆచారానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వధువు కోసం వస్తున్న వరుడిని నడిరోడ్డుపై ఆపి మరీ వధువు బంధువులు చేసిన నిర్వాకం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

తూర్పు చైనాలోని (East China) జియాంగ్సు ప్రావిన్స్‌లోని తైజౌ ప్రాంత పరిధిలోని గ్రామంలో అక్టోబర్ 20న చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు (Viral photos and videos) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. స్థానికంగా జరిగిన వివాహ కార్యక్రమంలో (wedding ceremony) ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వివాహ వేదిక వద్దకు వరుడు (groom) కారులో వస్తుంటాడు. అయితే వధువు (bride) వద్దకు వెళ్లే ముందు మధ్యలోనే అతడి కారును.. వధువు బంధువులు, గ్రామస్తులు చుట్టుముట్టి ఆపేస్తారు. అక్కడి ఆచారం ప్రకారం వివాహానంతరం వరుడు.. వధువు గ్రామానికి చెందిన వృద్ధులు తదితరులకు కానుకలు ఇచ్చి వారి మన్ననలను పొందాల్సి ఉంటుంది.

Holidays in November: అక్టోబర్‌లోనే కాదండోయ్.. నవంబర్‌లోనూ సెలవుల పండగే.. స్కూళ్లకు, కాలేజీలకు ఎన్ని రోజులు సెలవులంటే..!

అలాగే కొన్నిసార్లు డబ్బులను కవర్‌లో పెట్టి వధువు బంధువులకు ఇవ్వాల్సి వస్తుంది. అలా జరగని పక్షంలో వధువును తీసుకెళ్లే అవకాశం ఉండదు. కొన్నిసార్లు వివాహం రద్దు చేసే అవకాశం కూడా ఉంటుందట. ఈ సాంప్రదాయం ప్రకారం వరుడి కారు వద్దకు వెళ్లిన పలువురు వృద్ధులు.. డబ్బులు, సిగరెట్లు తదితరాలను డిమాండ్ చేశారు. ఈ సాంప్రదాయాన్ని అక్కడ లాన్ మెన్ అని పిలుస్తారు. వరుడు తనకు ఇష్టమైన భార్య కోసం ఎలాగైనా వివాహం చేసుకోవాలనే ధృడ నిశ్చయాన్ని తెలియజేయడంతో పాటూ బహుమతులు పంచడం ద్వారా దంపతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేయడం ఈ సాంప్రదాయ ఉద్దేశం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Shocking News: ఒక టీ, రెండు సమోసాలు కలిపి ఖరీదెంతో ఊహించగలరా..? ఈ బిల్లును చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!

Updated Date - 2023-11-01T18:57:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising