Viral video: మా అమ్మకు దక్కిన అత్యున్నత పురస్కారం.. అంటూ కూతురు పెట్టిన వీడియో చూస్తే..
ABN, First Publish Date - 2023-07-07T20:51:07+05:30
తల్లి.. తండ్రి.. గురువు.. దైవం.. అని పెద్దలు అన్నట్లు ఎవరి జీవితంలో అయినా తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం గురువుకే ఉంటుంది. ఓ విద్యార్థి చదువు, సంస్కారం నేర్చుకోవడంతో పాటూ జీవితంలో ఉన్నత స్థితికి చేరాడంటే.. అందులో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని..
తల్లి.. తండ్రి.. గురువు.. దైవం.. అని పెద్దలు అన్నట్లు ఎవరి జీవితంలో అయినా తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం గురువుకే ఉంటుంది. ఓ విద్యార్థి చదువు, సంస్కారం నేర్చుకోవడంతో పాటూ జీవితంలో ఉన్నత స్థితికి చేరాడంటే.. అందులో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఎవరు ఎంతటి స్థానంలో ఉన్నా.. చిన్నతనంలో చదువు చెప్పిన ఉపాధ్యాయుడిని ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ‘‘మా అమ్మకు దక్కిన అత్యున్నత పురస్కారం’’.. అంటూ కూతురు ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో విద్యార్థులు, ఉపాధ్యాయురాలికి సంబంధించిన వీడియో (Viral video) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు ఉద్యోగ విరమణ (Teacher Retirement) చేసింది. చివరి రోజు పాఠశాలకు వచ్చిన ఆమె.. అందరితో సరదాగా గడిపింది. విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులంతా ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే ఈ సమయంలో పలువురు విద్యార్థినులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమకు ఇన్నాళ్లూ చదువు చెప్పిన టీచర్.. పాఠశాల నుంచి వెళ్లిపోవడాన్ని వారు తట్టుకోలేకపోయారు. పరుగెత్తుకుంటూ ఉపాధ్యాయురాలి వద్దకు వెళ్లి, కౌగిలించుకుని బోరున విలపించారు.
విద్యార్థుల అభిమానాన్ని చూసి టీచర్ కూడా కన్నీటిపర్యంతమైంది. బాలికలను (girls) ఓదారుస్తూ.. బాగా చదువుకుని పైకి రావాలని సూచించింది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీశారు. ఈ వీడియోను సదరు ఉపాధ్యాయురాలి కూతురు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘మా అమ్మ స్కూల్ టీచర్‌గా పదవీ విరమణ పొందారు. ఆమెకు దక్కిన అత్యున్నత పురస్కారాన్ని చూడండి’’.. అని పేర్కొంటూ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ చిన్ననాటి జ్ఞపకాలను గుర్తు చేసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అప్పట్లో పల్లెల్లో గురువుల పట్ల విద్యార్థుల ప్రేమ, గౌరవం ఎంతో స్వచ్ఛంగా ఉండేది’’.. అని కొందరు, ‘‘ఈ రోజుల్లో అలాంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలా అరుదుగా ఉంటారు’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-07-07T20:54:24+05:30 IST