ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఈ యువతి టాలెంట్ మామూలుగా లేదుగా.. కారు డోరు తీయకుండానే లోపలకు ఎలా వెళ్లిపోయిందో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-04-08T21:20:48+05:30

విన్యాసాలు చేయడంలో చాలా మంది యువతులు.. యువకులతో సమానంగా పోటీపడుతుంటారు. కొందరైతే వినూత్న విన్యాసాలు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. మరికొందరైతే యువకులకు సాధ్యం కాని స్టంట్స్‌ను అవలీలగా చేసేస్తుంటారు. ఇలాంటి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విన్యాసాలు చేయడంలో చాలా మంది యువతులు.. యువకులతో సమానంగా పోటీపడుతుంటారు. కొందరైతే వినూత్న విన్యాసాలు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. మరికొందరైతే యువకులకు సాధ్యం కాని స్టంట్స్‌ను అవలీలగా చేసేస్తుంటారు. ఇలాంటి విన్యాసాలను చూసినప్పడు అరె! ఇదెలా సాధ్యం.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కారు డోరు తీయమంటూ తన ప్రియుడిని కోరింది. అయితే ఇందుకు అతను నిరాకరించడంతో చివరకు ఆమె ఏం చేసిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఓ యువకుడు కారు ఆపుకొని ప్రేయసి (girlfriend) కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అంతలో అక్కడికి వచ్చిన యువతి కారు దగ్గరికి వెళ్లి డోరు తీయమంటుంది. అయితే లోపలున్న వ్యక్తి.. ‘‘డోర్ తీయను.. నీకు చేతనైతే లోపలికి రా’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. ‘‘ఏంటీ డోర్ తీయవా.. సరే.. ఏం చేస్తాం’’.. అని అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుంది. అయితే రెండు అడుగులు వేసి, వెంటనే వెనక్కు తిరుగుతంది. తన ప్రియుడి వైపు చూస్తూ.. ‘‘ చూస్తావా.. నా టాలెంట్’’.. అని అంటూ చేతులు (young woman stunts) నేల మీద పెట్టి పల్టీలు కొడుతుంది.

Viral Video: ఈ కుర్రాడి టాలెంట్‌ను మెచ్చుకోకుండా ఉండలేరు.. ఫొటోలకు ఫోజులు ఎలా ఇవ్వాలో కూడా ఆ భార్యాభర్తలకు చూపించి మరీ..

తర్వాత కాళ్లను పైకి లేపి కారులోని సీటులో పెడుతుంది. తర్వాత కాళ్లతో డోర్‌ని గట్టిగా పట్టుకుని అలాగే పైకి లేచి లోపలికి వెళ్తుంది. నేరుగా సీట్లో కూర్చుని.. ‘‘ఎలా వుంది నా టాలెంట్’’.. అని ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కారులోకి ఇలాక్కూడా ఎక్కొచ్చా’’.. అని కొందరు, ఈ యువతి టాలెంట్ మామూలుగా లేదుగా.. అని ఇంకొందరు, ‘‘ఇది నిజంగా అద్భుతం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

Husband: భర్త వచ్చిన ప్రతీసారి ఆలస్యంగా నిద్రలేస్తున్న 16 ఏళ్ల కూతురు.. నిలదీస్తే రాత్రిళ్లు జరిగింది గుర్తు లేదన్న బాలిక.. అనుమానంతో..

Updated Date - 2023-04-08T21:20:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising