Bride Stunts: బాబోయ్.. ఇవేం స్టంట్స్..? వరుడి మెడకు కాలును చుట్టి.. మరో కాలుని తొడపై పెట్టి.. ఓ వధువు వింత విన్యాసాలు..!
ABN, First Publish Date - 2023-08-22T14:41:12+05:30
సినిమా పెళ్లిళ్లలో ఎలాంటి వింతలు, విశేషాలు, విన్యాసాలు చోటు చేసుకుంటుంటాయో.. ప్రస్తుతం నిజ జీవితంలో జరిగే వివాహ కార్యక్రమాల్లో అంత కంటే ఎక్కువే వింతలు జరుగుతుంటాయి. వీటన్నింటినీ వీడియోలుగా మార్చి నెట్టింట్లోకి వదులుతుంటారు. వీటిలో కొన్ని నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. కొందరు...
సినిమా పెళ్లిళ్లలో ఎలాంటి వింతలు, విశేషాలు, విన్యాసాలు చోటు చేసుకుంటుంటాయో.. ప్రస్తుతం నిజ జీవితంలో జరిగే వివాహ కార్యక్రమాల్లో అంత కంటే ఎక్కువే వింతలు జరుగుతుంటాయి. వీటన్నింటినీ వీడియోలుగా మార్చి నెట్టింట్లోకి వదులుతుంటారు. వీటిలో కొన్ని నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. కొందరు వధూవరులు రీల్స్ పేరుతో చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలను చాలా చూశాం. ప్రస్తుతం వధూవరులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వరుడి మెడకు కాలును చుట్టి.. వధువు చేసిన విన్యాసం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘‘బాబాయ్.. ఇవేం స్టంట్స్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో (wedding ceremony) వధూవరులు (bride and groom Stunts) వినూత్నం విన్యాసం చేశారు. అందరూ చేసినట్లు కాకుండా ఏదైనా వింతగా చేయాలని ట్రై చేశారు. అందుకు తగ్గట్టుగానే చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. నిలబడి ఉన్న వరుడి కాలు మీద ఓ కాలు పెట్టిన వధువు.. మరో కాలును అతడి మెడకు చుట్టేసి.. బ్యాలెన్స్ మీద చేతులు వదిలేసి ఏటవాలుగా వంగి చేతులు అటూ, ఇటూ చాపుతూ ఫోజులు ఇచ్చింది.
Crime News: ఉన్నట్టుండి బావను దూరం పెట్టిన మరదలు.. ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లగా..
వరుడు కూడా వధువును కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ సినిమా స్టైల్లో ఫోజులు ఇచ్చాడు. స్టంట్ విజయవంతంగా పూర్తవడంతో అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టి అభినందించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్! చాలా అద్భుతంగా చేశారు’’.. అని కొందరు, ‘‘ఏమాత్రం అదుపు తప్పినా అంతే’’.. అంటూ మరికొందరు, ‘‘ఇవెక్కడి విన్యాసాలు బాబోయ్!’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 27వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-08-22T14:41:12+05:30 IST