Sukumar -Pushpa-2: అదే ఐడియాతో ముందుకెళ్తున్నా!
ABN, First Publish Date - 2023-02-23T15:12:26+05:30
మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారాలంటున్నారు దర్శకుడు సుకుమార్(Sukumar). తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న ఆయన ట్రెండ్‌కి తగ్గట్లు వెళ్తునట్లు చెప్పారు. సినిమా ప్రమోషన్స్ విషయంలో సోషల్ మీడియా, రీల్స్ ఎంత ముఖ్యమో చెప్పుకొచ్చారు.
మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారాలంటున్నారు దర్శకుడు సుకుమార్(Sukumar). తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న ఆయన ట్రెండ్‌కి తగ్గట్లు వెళ్తునట్లు చెప్పారు. సినిమా ప్రమోషన్స్ విషయంలో సోషల్ మీడియా, రీల్స్ ఎంత ముఖ్యమో చెప్పుకొచ్చారు. ‘‘సినిమాలకు మాటలు, పాటలు రాసేటప్పుడు చాలా ఆలోచిస్తాను. అవి ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్‌గా రావాలని భావించి రాస్తాను. సినిమాలో డైలాగ్‌లు సోషల్ మీడియాలో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం చాలామంది రీల్స్, షార్ట్‌కు కనెక్ట్ అయ్యారు. ‘పుష్ప’ సినిమా విజయంలో ఇది కూడా భాగమే! సోషల్ మీడియాలో పుష్పలో డైలాగులు, పాటలు ఎంతో వైరల్ అయ్యాయి. అందుకే ‘పుష్ప2’కు కూడా అదే ఐడియాతో కొనసాగుతున్నా’’ అని అన్నారు. (Reels Importance in Promotion)
అల్లు అర్జున్ (allu arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించింది. విడుదల అన్ని చోట్ల వసూళ్ల వర్షం కురిపించింది. మొదటి భాగం సక్సెస్ భారీ అంచనాలు పెంచింది. దాంతో పుష్ప-2 (Pushpa 2)సినిమా అంతకుమించి ఉండాలని లెక్కల మాస్టర్ కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప 2’ చిత్రీకరణలో బిజీగా ఉంది. శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నారు. ఇటీవల వైజాగ్‌లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో ప్రారంభం కాబోయే షెడ్యూల్‌లో రష్మిక పాల్గొనబోతుందని సమాచారం.
Updated Date - 2023-02-23T17:31:55+05:30 IST