Super Foods: వామ్మో.. మనం రోజూ సూపర్ ఫుడ్ అనుకుని తింటున్న వీటితో ఇంత డేెంజరా? అవేంటో తెలిస్తే విస్తుపోతారు..
ABN, First Publish Date - 2023-03-26T15:50:14+05:30
తీసుకోవడం వల్ల పోషకాహార లోపం(Malnutrition) అనే సమస్యకు దూరంగా ఉండచ్చు. విచిత్రం ఏమిటంటే.. మనం సూపర్ ఫుడ్స్ అనుకునే కొన్ని ఆహార పదార్థాలు శరీరానికి విషంలా(Poison) కూడా మారతాయి.
మన శరీరానికి అద్భుతమైన పోషకాలను అందించి ఆరోగ్యంగా ఉంచే పదార్థాలను సూపర్ ఫుడ్స్(Super Foods) అంటారు. ఇలాంటి ఫుడ్ రోజూ తీసుకోవడం వల్ల పోషకాహార లోపం(Malnutrition) అనే సమస్యకు దూరంగా ఉండచ్చు. విచిత్రం ఏమిటంటే.. మనం సూపర్ ఫుడ్స్ అనుకునే కొన్ని ఆహార పదార్థాలు శరీరానికి విషంలా(Poison) కూడా మారతాయి. ఊహించని విధంగా ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడతాయి. అసలే ఈ కాలంలో చిన్న చిన్న సమస్యలకే ప్రాణాలు పుటుక్కుమంటున్నాయి. ఇక ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టే ఆహార పదార్థాల గురించి తెలుసుకోవడం, వాటి విషయంలో జాగ్రత్త పడటం ఎంతైనా మంచిది.
బంగాళాదుంపలు..(Potatoes)
బంగాళాదుంపలు అన్ని స్థాయి కుటుంబాలకు అందుబాటు ధరలో ఉండే దుంప కూరగాయ.కూరలు, సాంబార్, బోండా, చిప్స్ ఇలా ఎన్నిరకాలుగా వండినా లొట్టలేసుకుని తింటారు. ఈ బంగాళాదుంపలు మార్కెట్ లో కొనితెచ్చినప్పుడు బాగా గమనిస్తే రెండో మూడో ఆకుపచ్చ రంగు పొట్టుతో ఉన్నవి కనబడతాయి. ఇలా ఆకుపచ్చగా ఉన్న బంగాళాదుంపలు పచ్చివిగా పరిగణిస్తారు. ఒకటో రెండో ఇలాంటివి వంటలో వాడినా సమస్య ఉండదు కానీ అంతకు మించి వాడితే మాత్రం వాంతులు, తల తిరగడం, తలనొప్పి, శరీరంలోపల రక్తస్రావం జరుగుతాయి. కోమాలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది.అందుకే బంగాళాదుంపలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కక్కుర్తి పడి ఆకుపచ్చగా ఉన్న బంగాళాదుంపలు పడేయడం ఎందుకని మీ కడుపులో తోయకండి.
Read also: Skin Health: రోజూ ఇవి కొద్దిగా తింటే చాలు.. ముసలివాళ్ళు కూడా యవ్వనంగా మారతారు..
బాదం పప్పు.(Almonds)
బాదం పప్పు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిరోజూ రాత్రి ఓ నాలుగైదు బాదం పప్పులు నీటిలో నానబట్టి ఉదయాన్నే పొట్టు తీసుకుని తినడం చాలా మంచిందని అందరికీ తెలుసు. సాధారణంగా బాదం పప్పు తియ్యగా ఉంటాయి. కానీ కొన్ని బాదం పప్పులు చేదుగా ఉంటాయి. పల్లీలలో కొన్ని చెడిపోయినవి ఎలాగైతే ఉంటాయో అలాగే బాదం పప్పు కూడా చెడిపోయి చేదుగా ఉంటాయి. ఇలా చేదుగా ఉన్న బాదం పప్పు పొరపాటున నోట్లో వేసుకుని నమిలిన్పపుడు పోతేపోనీలే అని కొందరు మింగేస్తారు. కానీ ఇలా చెడిపోయి చేదుగా ఉన్న బాదం పప్పులో హైడ్రోజన్ సైనేడ్ అనే విషపూరిత సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో చేరగానే విషంలా రూపాంతరం చెందుతుంది. ముఖ్యంగా ఫ్రై చేసి, సాల్ట్ వేసిన బాదంపప్పులో ఇలా చెడిపోయినవి వేసేస్తుంటారు అమ్మకం దారులు. పొరపాటున ఐదుకు మించి ఇలాంటి చేదు బాదం పప్పులు తిన్నారంటే ఇక శరీరంలో విషం చేరిపోయినట్టే. ఇది నేరుగా ప్రాణాలమీదకు తెస్తుంది.
బ్రౌన్ రైస్..(Brown Rice)
చాలామంది బరువు తగ్గడానికి బ్రౌన్ రైస్ బెస్ట్ అనుకుంటారు. అలాగే మధుమేహం ఉన్నవారికి ఇది మంచిదని చెబుతారు. కానీ సాధారణ బియ్యంలోకంటే బ్రౌన్ రైస్ లో ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో నాడీవ్యవస్థపై ప్రభావం చూపించడం కాదు ఏకంగా దాడి చేసి నాడీవ్యవస్థను దెబ్బతీస్తుంది. బ్రౌన్ రైస్ తినేవారు ఒకటికి నాలుగు సార్లు ఈ బియ్యాన్ని కడిగి ఆ తరువాత వండుకోవాలి. ఇలా చేస్తే బియ్యంమీద ఉన్న ఆర్సెనిక్ చాలావరకూ తొలగిపోతుంది.
రాజ్మా బీన్స్ లేదా కిడ్నీ బీన్స్..(Rajma beans or Kidney beans)
కిడ్నీ బీన్స్, రెడ్ బీన్స్, రాజ్మా బీన్స్ ఇలా రకాలుగా పిలుచుకునే రాజ్మా బీన్స్ సరైన విధంగా వండకపోతే విషంలా శరీరాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. వీటిని సుమారు 9నుండి 10గంటలపాటు నానబెట్టి, 7నుండి 8విజిల్స్ వచ్చేవరకు ఉడికించి తరువాత కూర వండుకోవాలి. సాధారణ పెసపప్పు, కందిపప్పు వండినట్టు వీటిని వండాలని ప్రయత్నిస్తే ప్రాణాలకు ప్రమాదం.
జాజికాయ..(Nutmeg)
వంటగదిలో ఉన్న మసాలా దినుసుల్లో జాజికాయ కూడా ఒకటి. దీన్ని వంటల్లో ఉపయోగిస్తే వంట సువాసన , రుచి పెరుగుతాయి. అలాగే జాజికాయ వాడటం వల్ల జలుబు, దగ్గు, దూరమవుతాయి. కానీ ఎంత వాడాలో తెలియకుండా దీన్ని తీసుకుంటే వాంతులు, తల తిరగడం, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే చాలా కొద్దిగా దీన్ని తీసుకోవాలి.
Updated Date - 2023-03-26T16:15:43+05:30 IST