ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Software Couple: భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే.. వివాహ బంధంపై విరక్తితో విడాకుల కోసం సుప్రీంకోర్టుకు వెళ్తే..

ABN, First Publish Date - 2023-04-24T12:56:18+05:30

ఆ దంపతులిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే (Techie Couple). ఒకరు ఉదయం డ్యూటీకి వెళ్తే.. మరోకరు నైట్ డ్యూటీకి వెళ్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆ దంపతులిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే (Techie Couple). ఒకరు ఉదయం డ్యూటీకి వెళ్తే.. మరోకరు నైట్ డ్యూటీకి వెళ్తారు. అంటే.. ఇంట్లో ఇద్దరూ కలిసి ఉండేది చాలా రేర్ అన్నమాట. పెళ్లైనప్పటి నుంచి ఇదే తంతు. ఇక వారి దాంపత్య జీవితం ఎలా ఉంటదో ఊహించుకోవచ్చు. అలాంటప్పుడు వారికి వివాహా బంధం గురించి తెలిసే ఛాన్స్ ఎక్కడ ఉంది. దాంతో చివరకు.. ఇద్దరు మాట్లాడుకుని విడాకులకు రెడీ అయిపోయారు. మాకు విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కారు. ఇలా బెంగళూరుకు చెందిన టెకీ దంపతులు తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో (Supreme Court) విడాకుల కోసం వెళ్లారు. అక్కడ వారి కేసును పరిశీలించిన జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారించింది. ఈ నేపథ్యంలో వారికి సుప్రీం కోర్టు కీలక సూచన చేసింది. ఒకరినొకరు తెలుసుకునేందుకుగానూ ఇప్పటివరకు సమయం కేటాయించలేదని, వివాహా బంధానికి రెండోసారి అవకాశం ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించింది.

"దంపతులిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఒకరు పగలు డ్యూటీకి వెళ్తే.. మరొకరు రాత్రి డ్యూటీకి వెళ్తున్నారు. ఇక ఇద్దరి మధ్య అనుబంధానికి సమయం ఎక్కడుంది? అటువంటప్పుడు కలిసి ఉండటానికి మరోసారి ఎందుకు ప్రయత్నించకూడదు" అని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. ఇద్దరూ కలిసి ఉండేందుకు మరో అవకాశం ఇవ్వొచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. కానీ, అప్పటికే వివాహ రద్దుకు ఇరువురు ఒక నిర్ణయానికి వచ్చినట్లు వారిద్దరి తరఫు న్యాయవ్యాదులు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు నివేదించారు. కేసు విచారణ దశలో ఉండగా సుప్రీంకోర్టు మీడియేషన్ కేంద్రానికి వెళ్లినట్లు దంపతుల తరఫు లాయర్లు పేర్కొన్నారు.

Indian Origin: అమెరికాలో చరిత్ర సృష్టించిన భారత సంతతి సిక్కు మహిళ.. నిజంగా చాలా గ్రేట్!


అందులో భాగంగా ఇరు పక్షాలు విడాకులకు అంగీకరించాయని తెలిపారు. అలాగే సెటిల్‌మెంట్ కింద భార్యకు భర్త రూ.12.51లక్షలు ఇచ్చేలా డీల్ జరిగిందన్నారు. దంపతుల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. వారికి విడాకులు (Divorce) మంజూరు చేసింది. "రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తమకున్న అధికారాల ప్రకారం హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ 13B ప్రకారం పరస్పర అంగీకారంతో పార్టీల మధ్య వివాహాన్ని రద్దు చేస్తాం” అని సుప్రీంకోర్టు వెల్లడించింది. అలాగే ఈ కేసు తాలూకు రాజస్థాన్, లక్నోలలో నమోదైన కేసులన్నింటినీ సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.

Software Engineer: ఏడాదికి రూ.58 లక్షలు సంపాదిస్తున్నా.. అయినా నాదీ ఓ బతుకేనా..? వైరల్‌గా మారిన 24 ఏళ్ల ఓ టెకీ పోస్ట్..!

Updated Date - 2023-04-25T07:31:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising