ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Big Alert: ఉద్యోగులకు TCS హెచ్చరిక, ఆ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2023-05-31T21:33:27+05:30

ఉద్యోగులకు TCS హెచ్చరిక జారీ చేసింది. కంపెనీ పాలసీకి అనుగుణంగా ఆఫీసుకు రావాలని కోరింది. తక్షణమే ఉద్యోగులు ఆఫీసు లోకేషన్ నుంచి పనిప్రారంభించాలని కోరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉద్యోగులకు TCS హెచ్చరిక జారీ చేసింది. కంపెనీ పాలసీకి అనుగుణంగా ఆఫీసుకు రావాలని కోరింది. తక్షణమే ఉద్యోగులు ఆఫీసు లోకేషన్ నుంచి పని(Work From Office) ప్రారంభించాలని కోరింది. నిబంధనలు పాటించని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతేకాదు అవసరమైన సమయంలో ఆఫీసుకు హాజరుకాని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని మెమో(Memo) జారీ చేసింది.

‘‘ఉద్యోగులు కంపెనీ వాతావరణంలో పనిచేయడం చాలా ముఖ్యం. ఇది మంచి ఫలితాలనిస్తుంది. గత రెండేళ్లలో చాలామంది ఉద్యోగులు కంపెనీలో చేరారు. వారంతా తప్పక కంపెనీ లోకేషన్లలో పనిచేయాలి. సహకరించండి, ఎదగండి, కలిసి అనందించండి. ఇది సంస్థకు బలాన్నిస్తుంది. అందుకోసమే ఉద్యోగులను కలిసి పనిచేయాలని కోరుతున్నాం’’ అని TCS ప్రతినిధి చెప్పారు.

ఉద్యోగులు కంపెనీ కార్యాలయాల్లో పనిచేయడం మంచి ఫలితాలనిస్తుంది. నెలలో సగటున వారానికి మూడు రోజులు అసోసియేట్లందరూ ఆఫీసు నుంచి పనిచేయడం మా లక్ష్యం. ఆ దిశగా మేం అన్ని గ్రూపులతో కలిసి పనిచేస్తాం. ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కంపెనీ ప్రతినిధి చెప్పారు.

ఇంటి నుంచి పనిచేయాలనుకునే ఉద్యోగులు కనీసం నెలలో 12 రోజులు ఆఫీసుకు హాజరు కావాలి. మిగతా రోజుల్లో ఇంటి నుంచి పని సర్దుబాటు చేయవలసి ఉంటుందని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఉద్యోగులు ఆఫీసు పాలసీ పాటించకపోతే ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారనే విషయాన్ని TCS పేర్కొనలేదు.

Updated Date - 2023-05-31T21:33:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising