Viral News: తప్పమ్మా.. అలా చేయొద్దని కూతురికి చెప్పాల్సిన తండ్రే ప్రోత్సహించాడు.. ఓ వ్యక్తి సీక్రెట్‌గా వీడియో తీయడంతో..!
ABN, First Publish Date - 2023-05-18T11:09:19+05:30
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో (Durg district of Chhattisgarh) జరిగిన ఓ సంఘటన తాలూకు వీడియో అంతర్జాలంలో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో (Durg district of Chhattisgarh) జరిగిన ఓ సంఘటన తాలూకు వీడియో అంతర్జాలంలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి సీక్రెట్‌గా వీడియో తీసి నెట్టింట పెట్టడంతో ఇలా వైరల్ అయింది (Viral News). తండ్రి, కుమార్తె కారు జర్నీకి సంబంధించిందా వీడియో. ఇక వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు తండ్రికి భారీ జరిమానా విధించారు. కూతురు చేసిన పనిని 'తప్పమ్మా.. అలా చేయొద్దని చెప్పాల్సిన తండ్రే ప్రోత్సహించాడు' అందుకే అతడికి పోలీసులు ఫైన్ వేశారు. ఇంతకీ వీడియోలో ఏం ఉంది? కూతురు చేసిన తప్పు పనేంటి? దానికి తండ్రి ఎందుకు అడ్డుచెప్పలేదు! తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో (Bhilai Steel Plant) అతడు ఓ ఆఫీసర్. కూతురితో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. కారు రోడ్డుపై స్పీడ్‌గా దూసుకెళ్తోంది. తండ్రి డ్రైవింగ్ చేస్తున్న ఆ సమయంలో కారు కిటికీ అద్దాలు కిందికి దించిన కూతురు మెల్లగా అందులోంచి బయటకు వచ్చింది. పక్కన వాహనాలు వెళ్తున్న పట్టించుకోకుండా అలాగే దిక్కులు చూస్తూ, బయట వెలాడుతోంది. అలా ఆమె చేస్తున్న ఆ డేంజరస్ స్టంట్‌ను కారు వెనకాల బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకుల్లో ఒకరు వీడియో తీశారు. ఆ తర్వాత ఆ వీడియోను నెట్టింట పెట్టారు. అంతే.. ఆ వీడియో కాస్త వైరల్ అయింది.
Viral Video: ఈ కుర్రాడి టాలెంట్ అదుర్స్.. మెట్రో రైల్లో కూర్చుని అతడు మాట్లాడింది వింటే అవాక్కవడం ఖాయం..!
చివరికి వీడియో ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు వీడియోలోని దృశ్యాల ఆధారంగా కారు నంబర్ ద్వారా యజమాని అడ్రస్ ట్రేస్ చేశారు. తీరా.. చూస్తే అది బీఎస్‌పీ ఆఫీసర్ కారు అని తేలింది. దాంతో డీఎస్‌పీ సతీష్ ఠాకుర్ సదరు ఆఫీసర్‌కు రూ.2800 చలాన్ విధించారు. కూతురు తెలిసితేలియక చేసిన పనిని 'తప్పమ్మా.. అలా చేయొద్దని చెప్పాల్సిన తండ్రే ప్రోత్సహించడం' ఏంటని డీఎస్‌పీ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులకు ఆయన కీలక సూచన చేశారు. కారు, బైక్‌పై ప్రయాణించేటప్పుడు పిల్లలు ఇలాంటి స్టంట్స్ చేయకుండా చూసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Viral Video: వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. పెట్రోల్ ఖర్చును తగ్గించుకునేందుకు ఈ వ్యక్తి ఏం చేశాడో చూస్తే..!
Updated Date - 2023-05-18T11:09:19+05:30 IST