ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: బాహుబలి సినిమాను తలదన్నే రీతిలో వందల ఏళ్ల నాటి డ్యామ్.. అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

ABN, First Publish Date - 2023-08-06T16:09:16+05:30

భారీ వర్షాలు, వరదల కారణంగా వచ్చే నీటిని ఒడిసిపట్టి వ్యవసాయ, పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి వీలుగా డామ్‌లు నిర్మిస్తారు. వరద రావడం ఎక్కువైపోతే డ్యామ్ గేట్లు ఎత్తేసి నీటిని వదులుతుంటారు. డ్యామ్‌ల్లో నుంచి వేగంగా ప్రవహించే నీటిని చూడడం చాలా అద్భుతంగా ఉంటుంది.

భారీ వర్షాలు, వరదల కారణంగా వచ్చే నీటిని ఒడిసిపట్టి వ్యవసాయ, పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి వీలుగా డామ్‌లు (Dams) నిర్మిస్తారు. వరద (Flood water) రావడం ఎక్కువైపోతే డ్యామ్ గేట్లు ఎత్తేసి నీటిని వదులుతుంటారు. డ్యామ్‌ల్లో నుంచి వేగంగా ప్రవహించే నీటిని చూడడం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో (Viral Video)లో ఇరాన్‌ (Iran)లోని చారిత్రత్మక షష్తార్ హైడ్రాలిక్ సిస్టమ్ (Shushtar hydraulic system) నుంచి ప్రవహిస్తున్న నీరు కనిపిస్తోంది. ఈ డ్యామ్‌ను రోమన్లు కొన్ని వందల ఏళ్ల క్రితం నిర్మించారు.

వందల ఏళ్ల క్రితం రోమన్లు (Romans) ఇరాన్‌లో ఈ డ్యామ్‌ను నిర్మించారు. ఇప్పటికీ ఆ డ్యామ్ చెక్కు చెదరకుండా ఉంది. ఈ క్లీన్ హైడ్రాలిక్ సిస్టమ్‌లో 13 ఆనకట్టలు, వంతెనలు, నీటి కాలువలు ఉన్నాయి. ప్రపంచంలోని పురాతన హైడ్రాలిక్ సిస్టమ్‌లలో ఇది ఒకటి. పారిశ్రామిక అభివృద్ధి కోసం దీనిని సస్సానిడ్ సామ్రాజ్యం నిర్మించింది. గ్రానైట్ మరియు లైమ్ మోర్టార్‌తో ఈ డ్యామ్‌ను నిర్మించారు. రాతి గోడలపై అందమైన శిల్పాలను చెక్కారు. ఈ డ్యామ్ అందాన్ని చూసేందుకు ఇరాన్ వెళ్లే పర్యాటకులు క్యూ కడుతుంటారు.

Viral Video: అది త్రీడీ యానిమేషన్ కాదు.. ప్రకృతిలోని అద్భుతం.. వైరల్ అవుతున్న పిడుగు పాటు వీడియో!

Massimo అనే ట్విటర్ పేజీలో షేర్ అయిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 7 లక్షల మందికి పైగా వీక్షించారు. అప్పటి ఇంజినీరింగ్ ప్రతిభ (Engineering Talent)ను ప్రశంసిస్తూ చాలా మంది నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ``అప్పుడు ఉన్న పరిమిత సాంకేతికతతో ఎంతటి అద్భుతాన్ని నిర్మించారు``, ``రోమన్ల ప్రతిభ అమోఘం``, ``వారి ముందు చూపు ఏంటో ఈ డ్యామ్ చెబుతోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-08-06T16:16:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising