ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీరిద్దరిదీ కూడా జై భీమ్‌లోని సినతల్లి కథలాంటిదే.. రూ.40 లక్షల పరిహారాన్ని ప్రభుత్వమే వీళ్లకు ఇవ్వాలని కోర్టు తేల్చడం వెనుక..

ABN, First Publish Date - 2023-02-16T19:31:10+05:30

జై భీమ్ లో సినతల్లి కథలా వీరు కూడా అన్యాయంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జై భీమ్ (jai bhim) సినిమా చూసినవాళ్ళకు సిన్నతల్లి (sinathalli) పాత్ర మనసులోతుల్లో పాతుకుపోయి ఉంటుంది. భర్త కోసం ఆమె పడే ఆరాటం, ఆమెకు లాయర్ చంద్రు (Lawyer chandru) సహకారం ఇచ్చి న్యాయపరంగా చేసే పోరాటం సగటు మనిషిని కదిలిస్తుంది. అచ్చం అలాంటి సంఘటనే మరొక చోట జరిగింది. చేయని నేరానికి అన్యాయంగా జైలు శిక్ష అనుభవించిన వీరి కేసులో కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ అమాయకుల గురించి తెలుసుకుంటే..

తమిళనాడు (Tamilnadu)లో నివసించే ట్రక్ డ్రైవర్ (Truck driver) సకుల్ హమీద్, క్లీనర్ రమేష్ ఇద్దరూ చంఢీఘడ్ (Chandighar) నుండి కేరళ(Kerala)కు ట్రక్ లో వస్తున్నారు. ట్రక్కులో 1600బాక్సుల మద్యం(Liquor) ఉంది. వారు ప్రయాణిస్తున్న ట్రక్కును మధ్యప్రదేశ్(Madhya pradesh) లోని నంగల్వాడి వద్ద ఆ ప్రాంత సబ్ ఇన్స్పెక్టర్ మజర్ ఖాన్ అడ్డుకున్నారు. సకుల్ హమీద్, రమేష్ ఇద్దరూ ఆ సబ్ ఇన్పెక్టర్ కు ట్రక్ లో లోడుకు సంబంధించిన అన్ని పేపర్స్ చూపించారు. అయితే సకుల్ హమీద్, రమేష్ ఇద్దరి మీదా సబ్ ఇన్పెక్టర్ మజర్ ఖాన్ అక్రమ కేసులు బనాయించాడు. దీంతో వారిద్దరూ చెయ్యని నేరానికి 2019 నవంబర్2వ తేదీన అరెస్ట్ కాబడ్డారు. అప్పటి నుండి 20నెలలపాటు వాళ్ళు జైలు జీవితం గడిపారు. అన్నిరోజులూ సకుల్ హమీద్ భార్య అతనికి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకురావడానికి చాలా కష్టపడింది. 2021 జూలై12న వారు బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ తరువాత వారు లాయర్ రిషి తివారితో కలసి ఎఫ్ఐఆర్(FIR) రద్దు చెయ్యాలని కోర్టులో ఫిటిషన్ వేశారు. దీంతో కోర్టు విచారణ ప్రారంభించింది.

Read also: Shocking Video: ఇంటి పైకప్పు పై నుండి వేలాడుతున్న పాము తోక.. కదిలించగానే ఏం జరిగిందో చూడండి..


కోర్టు విచారణలో నిజాలన్నీ బయటకు వచ్చాయి. సకుల్ హమీద్, రమేష్ ఇద్దరూ వస్తున్న లారీలో లోడ్ కు సంబంధించి చండీఘర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ట్రక్ లో మద్యాన్ని కేరళ చేరేవరకు తెరవకూడదనే నిబంధనతో కూడిన డాక్యుమెంట్స్ ను ఇచ్చారు. అవే పేపర్లను డ్రైవర్ సకుల్ హమీద్ సబ్ ఇన్పెక్టర్ మజల్ ఖాన్ కు చూపించారు. కానీ సబ్ ఇన్పెక్టర్ మాత్రం అవన్నీ ఫేక్ పత్రాలని డ్రైవర్, క్లీనర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారు. చండీఘర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు తాము ఇచ్చిన కాగితాలు, డ్రైవర్ పోలీసులకు చూపించిన కాగితాలు ఒకటేనని తేల్చడంతో కోర్టు సదరు పోలీసుల నిర్వాకం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. చేయని నేరానికి 20నెలలు జైలు జీవితం గడిపిన వారికి పరిహారంగా 20లక్షల చొప్పున మొత్తం 40 లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. మొదట ప్రభుత్వం బాధితులకు పరిహారం చెల్లించి తరువాత పోలీసుల నుండి రికవరీ చేసుకోవాలని ఆదేశించింది. అధికారం చేతిలో ఉందని అమాయకుల మీద ఇలాంటి నేరాలు మోపుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, బాధితులకు అందరికీ ఇలాంటి న్యాయం జరిగితే బాగుండు అంటున్నారు నెటిజన్లు.

Updated Date - 2023-02-16T19:31:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising