ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: ఓ రిటైర్డ్ ఇంజనీర్‌కు షాకింగ్ అనుభవం.. ఇంటి తలుపులకు రూ.500 నోటు.. ఏంటా అని లోపలికి వెళ్లి చూస్తే..!

ABN, First Publish Date - 2023-07-24T16:08:39+05:30

తాజాగా ఢిల్లీలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఓ రిటైర్డ్ ఇంజనీర్ ఇంటికి తిరిగి వచ్చి డోర్ లాక్ పగిలిపోయి ఉండడం గమనించాడు. అతడి ఇంటి తలుపులకు ఓ 500 రూపాయల కాగితం అంటించి ఉంది. షాకైన టెకీ లోపలికి వెళ్లి చూడగా కొన్ని వస్తువులు చిందరవందరగా ఉన్నాయి.

తాజాగా ఢిల్లీ (Delhi)లో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఓ రిటైర్డ్ ఇంజనీర్ ఇంటికి తిరిగి వచ్చి డోర్ లాక్ పగిలిపోయి ఉండడం గమనించాడు. అతడి ఇంటి తలుపులకు ఓ 500 రూపాయల కాగితం అంటించి ఉంది. షాకైన టెకీ లోపలికి వెళ్లి చూడగా కొన్ని వస్తువులు చిందరవందరగా ఉన్నాయి. దీంతో తన ఇంట్లోకి దొంగలు (Thieves) వచ్చినట్టు గుర్తించాడు. ఇంట్లో విలువైన వస్తువులు లేకపోవడం, రూపాయి కూడా దొరక్కపోవడంతో దొంగలకు కోపం వచ్చింది. దీంతో ఆ ఇంటి తలుపులకు రూ.500 (Rs.500) నోటు అంటించి వెళ్లిపోయారు (Viral News).

ఢిల్లీలోని రోహిణిలోని సెక్టార్ 8లో ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం రామకృష్ణ అనే రిటైర్డ్ ఇంజనీర్ ఇంట్లో దొంగలు పడ్డారు. 20వ తేదీన రామకృష్ణ తన భార్యతో కలిసి గురుగ్రామ్‌లో ఉంటున్న కొడుకు ఇంటికి వెళ్లాడు. 21వ తేదీన అతడికి పక్కింటి వారి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఇంట్లో చోరీ జరిగినట్టు తెలుసుకున్న రామకృష్ణ వెంటనే ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపుల దగ్గర రూ.500 నోటు పడి ఉండడం గమనించాడు. తన ఇంట్లో చోరీ (Theft) జరిగినట్టు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Viral: తాళం లాక్కుని కార్లో కూర్చున్న 3 ఏళ్ల కొడుకు.. పొరపాటున లాక్ బటన్‌ నొక్కడంతో డోర్లు బంద్.. చివరకు..!

ఇంట్లో ఎవరూ లేనట్టు తెలుసుకున్న దొంగలు 21వ తేదీ ఉదయం చోరీకి పాల్పడ్డారు. అయితే వారికి ఆ ఇంట్లో ఏమీ దొరకలేదు. విలువైన వస్తువులు కాదు కదా.. ఒక్క రూపాయి కూడా కనిపించలేదు. దీంతో ఆగ్రహం చెందిన దొంగలు తమ దగ్గర ఉన్న రూ.500 నోటును తలుపులకు అంటించి వెళ్లిపోయారు. తన ఇంట్లో విలువైన వస్తువులు ఏవీ లేవని, డబ్బులు కూడా ఉంచలేదని రామకృష్ణ పోలీసులకు తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-07-24T16:08:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising