ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pushpa 2: అల్లు అర్జున్ అందుకోసం టైం తీసుకున్నాడు

ABN, First Publish Date - 2023-01-10T14:32:21+05:30

ఘన విజయాన్ని చాటి చూసిన ఈ 'పుష్ప' సినిమా పార్టు 2 కోసం ఒక్క భారతదేశ ప్రేక్షకులే కాదు, ప్రపంచంలోనే చాలామంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పార్ట్ 2 షూటింగ్ కూడా గత సంవత్సరం (2022) లోనే మొదలెడతారు అని అనుకున్నారు కానీ, మొదలెట్టలేదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రానున్న రోజుల్లో ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న సినిమా ఎదో తెలుసా? అది ఇంకేదో కాదు, అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ కాంబినేషన్ (Director Sukumar)లో వస్తున్న 'పుష్ప 2' (Pushpa 2). ఈ సినిమా మొదటి పార్టు డిసెంబర్ 2021 లో విడుదల అయింది. విడుదల అయిన తరువాత మొదట కొంచెం నెమ్మదిగా, ఆ తరువాత ఒక ప్రభంజనం లో ప్రపంచం అంతా ఈ సినిమా గురించి, అందులో అల్లు అర్జున్ 'తగ్గేదే లే' (Thaggede Le) మాట గురించి, ఈ సినిమాలో పాటల గురించి, ఒకటేంటి ఈ సినిమా గురించే ఎక్కడ చూసిన మాట్లాడుకున్నారు (Pushpa became a topic everywhere). అంతర్జాతీయంగా కూడా ఎంతో ఖ్యాతిని ఆర్జించింది ఈ సినిమా, అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులు ముఖ్యంగా అల్లు అర్జున్, తరువాత సుకుమార్ కి మిగతా టెక్నిషియన్స్ కి తీసుకొచ్చి పెట్టింది.

ఇంతటి ఘన విజయాన్ని చాటి చూసిన ఈ 'పుష్ప' సినిమా పార్టు 2 కోసం ఒక్క భారతదేశ ప్రేక్షకులే కాదు, ప్రపంచంలోనే చాలామంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పార్ట్ 2 షూటింగ్ కూడా గత సంవత్సరం (2022) లోనే మొదలెడతారు అని అనుకున్నారు కానీ, మొదలెట్టలేదు. చాలా టైం తీసుకొని ఈమధ్యనే షూటింగ్ మొదలెట్టారు. అయితే ఎందుకు ఇంత కాలయాపన చేసారు రెండో పార్టు షూటింగ్ కి అంటే, అల్లు అర్జున్ తన క్యారెక్టర్ కోసం ప్రిపేర్ అయ్యాడట. అంటే తను ఎంత డేడికేటెడ్ గా చెయ్యాలనుకున్నాడో ఈ సినిమాని దాన్ని బట్టి తెలుస్తోంది. మొదటి పార్టు హిట్ అవటమే కాకుండా, ప్రపంచం అంతటా ఆ సినిమా గురించే మాట్లాడుకున్నారు. అటువంటిది ఇంక రెండో పార్ట్ సినిమా ఎలా ఉండాలి, మొదటి దానికి మించి ఉండాలి, అంటే, ఇంకా బాగా కష్టపడాలి అని అల్లు అర్జున్, అలాగే సుకుమార్ కూడా అనుకున్నారు అని తెలిసింది.

అందుకోసం ఎంత లేట్ అయినా పరవాలేదు, టైం తీసుకొని, తన క్యారెక్టర్ కోసం ఫుల్ గా ప్రిపేర్ అయ్యాకే షూటింగ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పాడట దర్శకుడు సుకుమార్ కి. అందుకోసమే షూటింగ్ ఇంత లేట్ అయిందని తెలిసింది. అయితే ఇప్పుడు షూటింగ్ మొదలెట్టాక, అల్లు అర్జున్ తో నటిస్తున్న మిగతా నటులు అందరూ ఆశ్చర్యపోతున్నారు అని తెలిసింది. అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ చూసి, ఇందుకా ఇంత టైం తీసుకున్నాడు, ఎంత బాగా చేస్తున్నాడు అని ఆశ్చర్యపోతున్నారుట, ఎంత ప్రిపేర్ అయితే ఇంత బాగా చేస్తున్నాడు అని కూడా అనుకుంటున్నారట. 'పుష్ప 2' ఒక చరిత్ర సృష్టించే దిశగా వెళుతోంది అని యూనిట్ సభ్యులు అందరూ అనుకుంటున్నారట కూడా. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని ఇంకా అందంగా, ఆసక్తికరంగా, అందరి పాత్రలకు ప్రాముఖ్యం ఇస్తూ సినిమాని ఎక్కడికో తీసుకెళుతున్నాడు అని అంటున్నారు యూనిట్ సభ్యులు. 'పుష్ప 1' తోటే దర్శకుడు సుకుమార్ పేరు మారుమోగింది, కానీ పార్టు 2 తో అతని పేరు చరిత్ర పుస్తకాల్లో రాస్తారు అని కూడా అంటున్నారు. ఇది ఎదో అతిశయోక్తి అని అందరూ అనుకోవచ్చు ఏమో కానీ, యూనిట్ సభ్యులు మాత్రం ఇది నిజం అని నమ్మి చేస్తున్నారు, ముఖ్యంగా అల్లు అర్జున్. ఇందులో కథానాయిక పాత్ర వేసిన రష్మిక మందన్న (Rashmika Mandanna) కి ఎంత పేరు వచ్చిందో తెలుస్తూనే వుంది.

Updated Date - 2023-01-10T14:32:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising