ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Republic day: జనవరి 26నే రిపబ్లిక్ డే ఎందుకు?.. చరిత్ర ఏం చెబుతుందో తెలుసా!

ABN, First Publish Date - 2023-01-26T12:28:37+05:30

ప్రతిసారి మాదిరిగానే ఈ ఏడాది కూడా యావత్ దేశం గణతంత్ర శోభను సంతరించుకుంది. ఘనమైన వేడుకలను నిర్వహించుకుంటోంది. అసలు జనవరి 26నే రిపబ్లిక్ డే (Republic day) వేడుకలు ఎందుకు జరుపుకోవాలి?.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యావత్ భారతవని (India) వేడుక జరుపుకునే విశిష్ఠ సందర్భాల్లో గణతంత్ర దినోత్సవం (Republic day) ఎంతో ప్రధానమైనది. ప్రత్యేకమైన ఈ పర్వదినాన ప్రతిఏడాది దేశవ్యాప్తంగా మువన్నెల జెండా రెపరెపలాడుతుంది. ప్రతిసారి మాదిరిగానే ఈ ఏడాది కూడా యావత్ దేశం గణతంత్ర శోభను సంతరించుకుంది. ఘనమైన వేడుకలను నిర్వహించుకుంటోంది. అసలు జనవరి 26నే రిపబ్లిక్ డే (Republic day) వేడుకలు ఎందుకు జరుపుకోవాలి?. రాజ్యాంగ సభ నవంబర్ 26, 1949నే భారత రాజ్యాంగానికి (Constitution) ఆమోదముద్ర వేసినప్పటికీ ఆ తర్వాత ఏం జరిగింది?. అమల్లోకి తీసుకురావడానికి ఎందుకు సమయం తీసుకున్నారు?. జనవరి 26 తేదీని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో సమాధానం ఉంది. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం...

బ్రిటిష్ వలస విముక్తి కోసం జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో జనవరి 26కు విశిష్ఠ ప్రాధాన్యత ఉంది. సంపూర్ణ విముక్తే లక్ష్యంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (Indian national Congress) జనవరి 26, 1930న ‘పూర్ణ స్వరాజ్’ (Poorna Swaraj) డిక్లరేషన్‌ను అధికారికంగా ప్రకటించింది. స్వాతంత్ర్యోద్యమంలో చివరి దశకు అంకురార్పణ జరిగింది ఆ రోజే. అందుకే నవంబర్ 26, 1949నే రాజ్యాంగానికి రాజ్యాంగ సభ తెలిపినా.. దానిని అమల్లోకి తీసుకొచ్చేందుకు జనవరి 26, 1950 తేదీ వరకు వేచిచూశారు. ఇక రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీని పురష్కరించుకుని ప్రతిఏడాది రిపబ్లిక్ డే నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే.

ఎందుకంత ప్రాధాన్యత...

స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత కీలకమైన సహాయ-నిరాకరణ ఉద్యమం (Non-cooperation movement) 1922 ఫిబ్రవరిలో అర్ధాంతరంగా నిలిచిపోయింది. చౌరీ చౌరా (chauri Chaura incident) ఘటన ఇందుకు కారణమైంది. సహాయ-నిరాకరణ ఉద్యమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న నిరసనకారులపై బ్రిటిష్ పోలీసులు కాల్పులు జరిపారు. ఫలితంగా హింస చెలరేగింది. దీంతో అహింసాయుత పద్ధతుల్లో నిరసనలు తెలియజేసేందుకు దేశం ఇంకా సంసిద్ధంగాలేదని భావించిన మహాత్మాగాంధీ (Mahatma Gandhi) సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత కొంతకాలంపాటు స్వాతంత్ర్యోద్యమం స్థబ్ధుగా ఉంది. చెప్పుకోదగ్గ పరిణామాలేవీ జరగలేదు. మళ్లీ జనవరి 26, 1930న ‘పూర్ణ స్వరాజ్’ ప్రకటనతో చివది దశ స్వాతంత్ర్య పోరాటం ఆరంభమైంది. ఈ కారణంగానే స్వాతంత్ర్య పోరాటంలో జనవరి 26కు అంతటి ప్రాధాన్యత ఉంది.

Updated Date - 2023-01-26T12:34:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising