Uber Driver: హ్మ్.. నీకు ఇంగ్లీషు కూడా వచ్చా..? ఏం చదువుకున్నావేంటని డ్రైవింగ్ చేస్తున్న యువతిని అడిగిన కస్టమర్.. ఆమె చెప్పింది విని..
ABN, First Publish Date - 2023-05-03T12:38:46+05:30
నేటి సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో సత్తా చాటుతున్నారు. తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు కూడా.
ఇంటర్నెట్ డెస్క్: నేటి సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో సత్తా చాటుతున్నారు. తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు కూడా. ఓవైపు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు తాము ఎంచుకుంటున్న రంగాలలో రాణిస్తున్నారు. ఇప్పటికే క్రీడా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మహిళలు తమదైన ముద్ర వేశారు. సమాజంలో ఎన్ని సవాళ్లు ఎదురైన వాటన్నింటిని అధిగమిస్తూ తమ విధులను నిర్వహిస్తున్నారు నేటీ స్త్రీ మూర్తులు. ఇలా తమను తాము నిరూపించుకుంటూ తమలాంటి వారెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ కోవలో ఇప్పటికే ఎందరో వనితల సక్సెస్ స్టోరీలు మనం చదివాం. ఇప్పుడు ఇదే కోవకు చెందిన అందులోనూ చాలా అరుదుగా కనిపించే క్యాబ్ డ్రైవర్‌గా (Cab Driver) పని చేస్తున్న మరో యువతి సక్సెస్ జర్నీ గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. అసలు ఆమె క్యాబ్ డ్రైవర్‌గా మారడం వెనుక ఉన్న కథ ఏంటి? ఏ పరిస్థితుల్లో ఆమె ఈ వృత్తిని ఎంచుకోవాల్సి వచ్చింది? అంతకుముందు ఆమె ఏం చేసింది? ఈ వృత్తిలోకి వచ్చాక ప్రస్తుతం ఆమె లైఫ్ ఎలా ఉంది? తదితర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రణామ్ కళ్యాణ్ సింగ్ అనే ఫేస్‌బుక్ యూజర్ ఈ ఉమెన్ ఉబెర్ క్యాబ్ డ్రైవర్ (Uber Cab Driver) సక్సెస్ గురించి తన ఫేస్‌బుక్ పేజీలో వివరించారు. ఆమె పేరు దీప్త ఘోష్ (Deepta Ghosh). బెంగాల్ రాజధాని కోల్‌కతా వాసి. ఆయన ఫేస్‌బుక్ పేజీలో (Facebook Page) రాసిన స్టోరీ ప్రకారం.. సింగ్ జీ తన నివాసం నుంచి లేక్ మాల్‌కు వెళ్లేందుకు ఉబెర్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. దాంతో అటువైపు నుంచి ఓ క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేశారు. తీరా.. ఫోన్ లిఫ్ట్ చేస్తే అత్యంత మధురమైన గొంతుతో ఓ మహిళ మాట్లాడింది. ఉబెర్ క్యాబ్ బుక్ చేశారుగా పీకాప్ లోకేషన్ ఎక్కడ అని అడిగిందట. అంతే.. సింగ్ జీ కొద్దిసేపు షాక్‌లోనే ఉండిపోయారు. కొంతసేపటి తర్వాత క్యాబ్ వచ్చి ఆగింది. ఆయన అందులో ఎక్కి కూర్చున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా ఆమెతో మాటలు కలిపారు సింగ్. మీరు మాట్లాడుతుంటే బాగా చదువుకున్న వారిలా ఉన్నారు. ఇంతకుముందు ఏం చేసేవారు? అసలేం చదువుకున్నారు? అని దీప్తతో అడిగారు. దాంతో ఆమె చెప్పిన సమాధానం విని సర్‌ప్రైజ్ అయ్యారట సింగ్.
Viral News: జీవితంలో అసలు పెళ్లే చేసుకోదట.. కానీ ఓ బిడ్డకు తల్లి అవాలని మాత్రం ఉందట.. చివరకు ఈ యువతి ఏం చేసిందంటే..!
ఇంతకీ ఆమె ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. అంతేకాదండయో.. అంతకుముందు ఆరు కంపెనీలలో ఉద్యోగం కూడా చేశారట. కానీ, 2020లో దీప్త తండ్రి చనిపోవడం.. ఆమె లైఫ్‌నే టర్న్ చేసేసింది. అప్పటివరకు ఫ్యామిలీకి దూరంగా.. ఎక్కడ జాబ్ ఉంటే అక్కడికి వెళ్లిపోయేవారట. కానీ, తండ్రి మరణంతో ఒంటరిగా తల్లి, చెల్లిని వదిలి వెళ్లడం ఆమెకు నచ్చలేదు. దాంతో తనకు ఎంతో బాగా తెలిసిన కారు డ్రైవింగ్‌నే నమ్ముకున్నారు. ప్రొఫెషనల్ డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించిన దీప్త.. 2021లో ఓ ఆల్టో కారు (Alto Car) కొన్నారు. ఆ తర్వాత ఉబెర్‌లో క్యాబ్ డ్రైవింగ్ చేయడం మొదలెట్టారు. ప్రస్తుతం క్యాబ్ డ్రైవర్‌గా ఆమె లైఫ్ చాలా హ్యాపీగా ఉందని తనతో చెప్పినట్లు సింగ్ జీ తన ఫేస్‌బుక్ స్టోరీలో రాసుకొచ్చారు. అంతేగాక వారానికి ఆరు రోజుల పాటు దాదాపు 6-7 గంటలు క్యాబ్ డ్రైవ్ చేస్తూ మంత్లీ సుమారు రూ.40వేల వరకు సంపాదిస్తున్నట్లు చెప్పారట. అంతే.. దీప్త సక్సెస్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమె పోరాటాన్ని, ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
Crime News: ఆ తల్లి చేసిన పొరపాటే.. 11 ఏళ్ల కూతురి పాలిటి శాపమయింది.. 40 ఏళ్ల వ్యక్తితో ఆ బాలిక పెళ్లి జరగడం వెనుక..!
Updated Date - 2023-05-03T12:48:54+05:30 IST