Maggi: రూ.10 పెడితే వచ్చే మ్యాగీని.. ఇతడు ఏకంగా రూ.400 కు అమ్ముతున్నాడేంటి..? అసలు ఎందుకింత ఖరీదంటే..!

ABN , First Publish Date - 2023-06-15T19:49:33+05:30 IST

పది రూపాయలు పెడితే వచ్చే మ్యాగీని నాలుగు వందలకు అమ్ముతున్నాడో వ్యక్తి. అదేంటని ప్రశ్నిస్తే తాను చేసిన మ్యాగీ గొప్ప రుచిగా ఉంటుందని చెబుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుండగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Maggi: రూ.10 పెడితే వచ్చే మ్యాగీని.. ఇతడు ఏకంగా రూ.400 కు అమ్ముతున్నాడేంటి..? అసలు ఎందుకింత ఖరీదంటే..!

ఇంటర్నెట్ డెస్క్: రాత్రి అయినా పగలైనా, ఇల్లైనా, ఆఫీసైనా కడుపులో కాస్తంత ఆకలిగా అనిపిస్తే వెంటనే వండుకుని తినగలిగే ఒకే ఒక వంటకం మ్యాగీ. రెండు నిమిషాల్లో సిద్ధమైపోయే ఈ ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను ఇష్టపడని వారు చాలా అరుదు. రుచిగా ఉండటమే కాకుండా ధర కూడా తక్కువగా ఉండటం దీనికున్న మరో ప్రత్యేకత. అయితే, ఓ వ్యక్తి మాత్రం రూ. 400 మ్యాగీని(Expensive Maggie) తయారు చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా(Viral Video) మారింది. తాను చేసే మ్యాగీ చాలా రుచిగా ఉంటుందని అతడు చెబుతున్నా..జనాలు మాత్రం ప్రతికూలంగా రియాక్ట్ అవుతున్నారు.

వీధి పక్కనున్న ఓ దుకాణంలో ఓ వ్యక్తి ఈ ఖరీదైన మ్యాగీని తయారు చేశాడు. దీని ధర తెలుసుకుని ఆశ్చర్యపోయిన ఓ కస్టమర్..బంగారంతో వండుతున్నావా అంటూ సరదాగా కామెంట్ కూడా చేశాడు. అతడే ఈ వీడియోను తీసి నెట్టింట షేర్ చేశారు. బంగారం కాదు.. దీన్ని రుచి చూశాక ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ తినాల్సిందే అని షాపు అతను కాన్ఫిడెంట్‌గా చెప్పడం కొసమెరుపు.

అతడు తొలుత ఉడుకుతున్న బఠాణీల్లో నూడుల్స్ కలిపాడు. కాసేపు దాన్ని ఉడకనిచ్చాక రకరకాల మసాళాలు పప్పు దినుసులు వేసి మరికాసేపు ఉడికిచ్చాడు. ఆ తరువాత చివర్లో రెండు మటన్ ముక్కలు కూడా దీనికి జోడించాడు. అంతా పూర్తయ్యాక నూడుల్స్ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

ఇదంతా చూసిన నెటిజన్లు ఆ నూడుల్స్ వండిన వ్యక్తిని తెగ విమర్శిస్తున్నారు. నూడుల్స్ అంటే రెండు నిమిషాల్లో రెడీ అయిపోవాలి గానీ ఇంత హంగామా అవసరమా అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.

Updated Date - 2023-06-15T19:55:05+05:30 IST