Marriage: పెళ్లయిన 3 గంటల తర్వాత బాత్రూంకు వెళ్లిన వరుడు.. తిరిగొచ్చి కుర్చీలో కూర్చుని అక్కడికక్కడే మృతి.. అసలేం జరిగిందంటే..!
ABN, First Publish Date - 2023-05-06T15:14:45+05:30
విధి విచిత్రమైంది. ఎప్పుడు ఎవరిని కలుపుతుందో, ఎవరిని విడదీస్తుందో, ఇంకెవరి జీవితాల్లో విషాదం నింపుతుందో ఎవరూ చెప్పలేరు. సంతోషంగా ఉన్న సమయంలో సడన్‌గా విషాదం నింపేస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన చుట్టూ ఎన్నో విషాద ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా..
విధి విచిత్రమైంది. ఎప్పుడు ఎవరిని కలుపుతుందో, ఎవరిని విడదీస్తుందో, ఇంకెవరి జీవితాల్లో విషాదం నింపుతుందో ఎవరూ చెప్పలేరు. సంతోషంగా ఉన్న సమయంలో సడన్‌గా విషాదం నింపేస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన చుట్టూ ఎన్నో విషాద ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా, బీహార్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పెళ్లికి ఒక్కరోజు ముందు వరుడు తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. పెళ్లయిన 3గంటల తర్వాత బాత్రూంకు వెళ్లిన వరుడు.. బయటికి వచ్చి కుర్చీలో కూర్చుని అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బీహార్ (Bihar) భాగల్‌పూర్‌లోని హోజాహిద్‌పూర్ పరిధి మీర్జన్‌హాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఝవా కోఠి ప్రాంతానికి చెందిన దిలీప్ ప్రకాష్ (31) అనే వ్యక్తి.. ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా (Software Engineer) పని చేసేవాడు. తల్లిదండ్రులు ఇతడికి కొన్నాళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇటీవల జార్ఖండ్‌లోని (Jharkhand) వెస్ట్‌సింగ్‌భూమ్ ప్రాంతానికి చెందిన ఆయుషి అనే యువతితో (Young woman) వివాహం నిశ్చయం చేశారు. వీరి వివాహానికి మే 3న ముహూర్తం ఖరారు చేశారు. ఆ సమయం రానే వచ్చింది. దీంతో ప్రకాష్ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొడుకును పెళ్లి దుస్తుల్లో చూసి మరింత మురిసిపోయారు. అయితే ఈ ఆనందం వారికి కొన్ని గంటల వరకే అనే విషయం ఊహించలేకపోయారు.
ప్రకాష్ పెళ్లి దుస్తులో స్నేహితులతో సరదాగా గడిపాడు. మరోవైపు బంధువులందరినీ ఆప్యాయంగా పలకరించాడు. ఈలోగా ముహూర్తం సమయం కూడా రానే వచ్చింది. వేదిక పైన అతిథులందరి సమక్షంలో వధువు (bride) మెడలో తాళి కట్టాడు. బుధవారం రాత్రి వేడుక పూర్తవగా గురువారం వేకువజామున.. వరుడు బాత్రూంకు వెళ్లాడు. అప్పటికే బాగా అలసిపోయి ఉన్న ప్రకాష్.. బయటికి రాగానే కుర్చీపై కూర్చుని కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నాడు. అంతే, ఇటు కూర్చున్నాడో లేదో.. కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న వారు లేపాలని చూడగా.. చలనం లేకుండాపడిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించగా.. గుండె పోటు (Heart attack) కారణంగా ప్రకాష్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
20 ఏళ్ల తర్వాత అందిన సంతానం.. ఆ భార్యాభర్తలిద్దరి సంతోషం మూడు నెలల్లోనే ఆవిరి.. ఒకే ఒక్క ఘటనతో..
ప్రకాష్ మృతితో వధూవరుల తల్లిదండ్రులతో పాటూ పెళ్లికి వచ్చినా వారంతా విషాదంలో మునిగిపోయారు. తాళి కట్టిన మూడు గంటల లోపే వరుడు మృతి (groom died) చెందడాన్ని ఊహించలేని వధువు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పెళ్లికి ఒక రోజు ముందు తల్లిదండ్రులతో ‘‘నాకెందుకో చాల సేపటి నుంచి గొంతులో మంటతో పాటూ గుండెల్లో నొప్పిగా ఉంది’’ అని చెప్పాడు. ఈ విషయం గుర్తు చేసుకున్న తల్లిదండ్రులు.. ‘‘అప్పుడే ఆస్పత్రిలో చూపించి ఉంటే ఇంత జరిగుండేది కాదేమో దేవుడా’’.. అని గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై వధూవరుల కుటుంబ సభ్యులు ఎవరూ ఫిర్యాదు చేసుకోలేదు.
Updated Date - 2023-05-06T15:14:45+05:30 IST