Viral Video: వామ్మో.. డ్రైవర్ లేకుండానే స్టార్ట్ అయిన ట్రాక్టర్.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..!
ABN, First Publish Date - 2023-03-03T11:50:18+05:30
నెట్టింట ఓ ట్రాక్టర్‌కు (Tractor) సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: నెట్టింట ఓ ట్రాక్టర్‌కు (Tractor) సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది (Video goes Viral). ఆ వీడియోలో ఏముందంటే.. ఓ షాపు ముందు ఒక ట్రాక్టర్ పార్క్ చేసి ఉంది. షాపు లోపల సిబ్బంది ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు. ఇంతలో షాపు బయట పార్క్ చేసి ఉన్న ఆ ట్రాక్టర్ డ్రైవర్ లేకుండానే ఆటోమెటిక్‌గానే స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన ట్రాక్టర్ అంతటితో ఆగితే బాగుండేది. కానీ అది ఆన్ అయినప్పుడు గేర్‌లో ఉండటంతో ట్రాక్టర్ ముందుకు కదిలింది. షాపు మెట్లు అడ్డం వచ్చినా అవేవి దాన్ని ఆపలేకపోయాయి.
ఆ మెట్లను కూడా దాటుకుని వచ్చి దుకాణం అద్దాలను ఢీకొట్టింది. తక్కువ స్పీడ్‌లోనే ఉండడంతో దుకాణం అద్దాలు కొద్దిసేపటి వరకు ట్రాక్టర్‌ను నిలువరించే ప్రయత్నం చేశాయి. కానీ ట్రాక్టర్ నెమ్మదిగా వేగం పుంజుకోవడంతో ఆ అద్దాలు కూడా పగిలిపోయాయి. అద్దాలను పగలకొట్టుకుని ముందుకొచ్చిన ట్రాక్టర్‌ను ఈసారి మరో మెట్టు అడ్డు పడింది. అంతలోనే దుకాణంలోంచి బయటికి పరుగెత్తిన సిబ్బంది ఒకరు.. ట్రాక్టర్ బ్రేకుపై చేయి వేసి ఆపడం జరిగింది. అంతలోనే మరో వ్యక్తి పరుగెత్తుకొచ్చి డ్రైవర్ సీటులో కూర్చుని ట్రాక్టర్‌ను కంట్రోల్ చేశాడు.
ఇది కూడా చదవండి: 'లగ్జరీ రిసార్ట్స్ కా బాప్'.. ఆస్తులు అమ్ముకున్నా ఇందులో ఒక్కరాత్రి బస చేయలేం బాస్..!
ఉత్తర ప్రదేశ్‌లోని (Uttar Pradesh) బిజ్నోర్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దుకాణం ఎదురుగానే కోత్వాలి పోలీసు స్టేషన్ ఉంది. పోలీసు స్టేషన్‌లో జరిగిన సమాధాన్ దివాస్‌లో పాల్గొనడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒకరు కారు తీసుకువస్తే.. కిషన్ కుమార్ అనే మరో వ్యక్తి ట్రాక్టర్ తీసుకొచ్చాడు. కిషన్ కుమార్ ఆ ట్రాక్టర్‌ని ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న దుకాణానికి ఎదురుగా పార్క్ చేసి వెళ్లాడు. పార్క్ చేసిన తర్వాత దాదాపు గంటసేపటికి ట్రాక్టర్ తనంతట తనే స్టార్ట్ అయి ఇలా బీభత్సం సృష్టించింది. ఈ దృశ్యం మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: ఇదేక్కడి వింత ఆచారంరా బాబోయ్.. హోలీ పేరిట మగాళ్ల తాట తీస్తున్నారుగా..!
Updated Date - 2023-03-03T11:50:23+05:30 IST