ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా వాడు బాగా డ్రైవ్ చేస్తాడంటూ పిల్లలకు బైక్‌లను ఇస్తున్నారా..? ఈ స్కూటీ ఓనర్‌కు ఎంత జరిమానా విధించారో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-03-09T20:28:07+05:30

తండ్రి తన బైకులో పిల్లలను కూర్చోబెట్టుకున్న సమయంలో హ్యాండిల్‌ను వారి చేతికి ఇస్తూ ఉంటారు. కొడుకు బండి తోలుతుంటే తెగ సంబరపడిపోతుంటారు. అయితే ఇది అప్పుడప్పుడూ ప్రమాదానికి దారి తీస్తుందని వారికి తెలీదు. మరికొందరైతే మా వాడు బండిని భలే డ్రైవ్ చేస్తాడంటూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తండ్రి తన బైకులో పిల్లలను కూర్చోబెట్టుకున్న సమయంలో హ్యాండిల్‌ను వారి చేతికి ఇస్తూ ఉంటారు. కొడుకు బండి తోలుతుంటే తెగ సంబరపడిపోతుంటారు. అయితే ఇది అప్పుడప్పుడూ ప్రమాదానికి దారి తీస్తుందని వారికి తెలీదు. మరికొందరైతే మా వాడు బండిని భలే డ్రైవ్ చేస్తాడంటూ... బైకును ఏకంగా పిల్లల చేతికే ఇస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. తెలీనితెలీని వయసులో ఉన్న పిల్లలు వాహనాలను ఎలాపడితే అలా డ్రైవ్ చేయడం చూస్తూనే ఉంటాం. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బాలుడు స్కూటీని తోలుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో స్కూటీ ఓనర్‌కు ట్రాఫిక్ అధికారులు ఎంత జరిమానా విధించారంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మొరాదాబాద్‌లోని మొఘల్‌పురా కొత్వాలి పరిధి జామా మసీదు (Jama Masjid) వంతెనపై ఈ ఘటన చోటు చేసుకుంది. రద్దీగా రోడ్డుపైకి ఓ స్కూటీ రావడంతో మిగతా వాహనదారులంతా షాక్ అయ్యారు. స్కూటీని పెద్దవారు డ్రైవ్ చేసుంటే ఎలాంటి సమస్యా ఉండేది కాదు. కానీ ఓ బాలుడు స్కూటీని తోలుకుంటూ (boy driving a scooty) వచ్చాడు. బాలుడి డ్రైవ్ చేయడం నేరం అనుకుంటే వెనుక మరో ముగ్గురు పిల్లలను ఎక్కించుకుని మరీ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. దీంతో మిగతా వాహనదారులు ఖంగుతిన్నారు. ఇంత చిన్న పిల్లలకు వాహనం ఎవరిచ్చారంటూ మండిపడ్డారు.

Viral Video: ఎర్రటి ఎండలో నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధ జంట.. పక్కనే వచ్చి ఆగిన పోలీసు కారు.. చివరకు జరిగింది చూసి నెటిజన్లు ఫిదా..!

ముగ్గురిని ఎక్కించుకున్న బాలుడు.. బండిని వేగంగా తోలుతుండంతో ఎక్కడ ప్రమాదానికి గురవుతారో అని అంతా ఆందోళన వ్యక్తం చేశారు. పక్కనే బైకుపై వెళ్తున్న వారు ఈ బాలుడిని వీడియో తీయడంతో పాటూ ఇలా డ్రైవ్ చేయడం తప్పు కదా.. అని వారిని మందలించారు. అయినా సదరు బాలుడు మాత్రం వినిపించుకోకుండా బండిని వేగంగా తోలుతూనే ఉన్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. ట్రాఫిక్ పోలీసుల (Traffic Police) వరకూ వెళ్లడంతో సదరు వాహన యజమానికి రూ.27,000లు చలాన్ (traffic e-challan) జారీ చేశారు. ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ చిన్న పిల్లలకు వాహనాలను ఇవ్వడం నేరమని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Viral Video: అర్ధరాత్రి లారీల మధ్యలో.. యువతిని పట్టుకుని ఈ పోలీసు చేస్తున్న పని చూస్తే.. ఛీకొడతారు..

Updated Date - 2023-03-09T20:35:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising