Viral Video: వారెవ్వా.. సూపర్ ఐడియా.. స్పామ్ కాల్స్‌ను భరించలేక ఓ మహిళ ఏం చేసిందో మీరే చూడండి..!
ABN, First Publish Date - 2023-08-26T16:44:24+05:30
మీరు స్పామ్ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? లోన్ కావాలా? క్రెడిట్ కార్డు కావాలా? డీటీహెచ్ ఆఫర్ అంటూ మీకు రోజూ ఫోన్లు వస్తున్నాయా? ఎన్ని ప్రయత్నాలు చేసినా స్పామ్ కాల్స్ ఆగడం లేదా? అవాంఛిత కాల్స్ ఆపడం ఎలాగో తెలియక ఇబ్బంది పడుతున్నట్టైతే మీరు ఒకసారి ఈ ట్రిక్ ఉపయోగించి చూడండి. కచ్చితంగా పని చేసేలాగా ఉంది.
మీరు స్పామ్ కాల్స్ (Spam calls)తో ఇబ్బంది పడుతున్నారా? లోన్ కావాలా? క్రెడిట్ కార్డు కావాలా? డీటీహెచ్ ఆఫర్ అంటూ మీకు రోజూ ఫోన్లు వస్తున్నాయా? ఎన్ని ప్రయత్నాలు చేసినా స్పామ్ కాల్స్ ఆగడం లేదా? అవాంఛిత కాల్స్ ఆపడం ఎలాగో తెలియక ఇబ్బంది పడుతున్నట్టైతే మీరు ఒకసారి ఈ ట్రిక్ (Desi Trick to spam calls) ఉపయోగించి చూడండి. కచ్చితంగా పని చేసేలాగా ఉంది. ప్రతిరోజూ స్పామ్ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్న ఓ మహిళ అద్భుతమైన ట్రిక్ ఉపయోగించి కాల్స్ చేసిన వారికే చుక్కలు చూపించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
ఒక మహిళ స్పామ్ కాల్‌లతో విసిగిపోయి, కాలర్‌కు అద్భుతమైన గుణపాఠం చెప్పింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మొబైల్‌కు కాల్ వస్తోంది. అది స్పామ్ కాల్ అని గ్రహించిన మహిళ ఫోన్ లిఫ్ట్ చేసి దానిపై ఓ స్టీల్ ప్లేట్ (Steel Plate) బోర్లించి, దానిపై గరిటెతో పలుసార్లు బాదింది. దీంతో అవతల ఫోన్ మాట్లాడిన వ్యక్తి చెవికి చిల్లు పడే ఉంటుంది. @Nationalist2575 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ``స్పామ్ కాల్స్‌తో విసిగిపోతున్నారా? అయితే ఇది ప్రయత్నించింది. ఇది నిజమైన భారతీయ ఆవిష్కరణ. నేను కూడా రేపు దీనిని ట్రై చేస్తా`` అని కామెంట్ చేశారు.
Viral Video: పాపం.. ఆ రైతు దగ్గర క్రొత్త ట్రాక్టర్ కొనేందుకు డబ్బులు లేవు.. తెలివి ఉపయోగించి ఏం చేశాడో చూడండి..
ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 5 లక్షల మందికి పైగా వీక్షించారు. 8 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ``సూపర్ ఐడియా``, ``ఇది చాలా బలమైన ఆవిష్కరణ``, ``స్పామ్ కాల్‌లను నిరోధించే దేశీ టెక్నిక్``, ``పాపం అవతలి వ్యక్తి మొబైల్ మైక్రోఫోన్ కూడా పోయి ఉంటుంది`` అని కామెంట్లు చేశారు.
Updated Date - 2023-08-26T16:44:24+05:30 IST