ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Free Beer Offer: రెండు బీర్లు ఫ్రీ అంటూ ఊరంతా పోస్టర్లు.. ఒకే ఒక్క కండీషన్ పెట్టినా క్యూ కట్టిన జనం..!

ABN, First Publish Date - 2023-03-07T15:48:51+05:30

ఫ్రీ.. ఫ్రీ అనే పదానికి... మనిషికి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంటుంది. మనిషి బలహీనతో... లేదంటే మానవ నైజమో.. ఏమో తెలియదు గానీ బిజినెస్‌మెన్‌లు కూడా ‘ఫ్రీ’ అనే నాలుగు అక్షరాల బోర్డు పెట్టి

ఊరంతా పోస్టర్లు..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఫ్రీ.. ఫ్రీ అనే పదానికి... మనిషికి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంటుంది. మనిషి బలహీనతో... లేదంటే మానవ నైజమో.. ఏమో తెలియదు గానీ బిజినెస్‌మెన్‌లు కూడా ‘ఫ్రీ’ అనే నాలుగు అక్షరాల బోర్డు పెట్టి భలే క్యాష్ చేసుకుంటారు. ఏ షాపింగ్ మాల్‌కెళ్లినా... ఏ మార్కెట్‌కెళ్లినా ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ.. ఇది కొంటే.. అది ఫ్రీ అంటూ వ్యాపారస్తులు భలే అట్రాక్ట్ చేసి బుట్టలో వేసుకుంటారు. ఇలా ఉచితాలకు కొదువే ఉండదు. అలా ఉచితాలకు కక్కుర్తిపడి ప్రాణాలు పోగొట్టుకున్న విషాద ఘటనలు కూడా లేకపోలేదు. ఇలాంటి వార్తలు ఎన్నో చూసుంటాం. వినే ఉంటాం. అయినా సామాన్యుడి నుంచి మధ్య తరగతి వరకు ఉచితాలకు పడిపోతుంటారు. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నాననే కదా? మీడౌట్? అయితే ఈ వార్త చదవాల్సింది.

పెద్ద.. పెద్ద బిజినెస్‌మేన్‌లేనా... నేను ఇవ్వలేనా? ఏంటి? అనుకున్నాడో ఏమో తెలియదు గానీ ఓ మొబైల్ షాపు (Mobile shop) నడుపుతున్న వ్యక్తి బుర్రలో కూడా ఫ్రీ అనే ఆలోచన పుట్టింది. అంతే స్మార్ట్‌ఫోన్‌ (Smartphone) కొంటే రెండు బీర్లు ఫ్రీ (Beers free) అంటూ పబ్లిసిటీ చేశాడు. పోస్టర్లు (Posters) అంటించి.. పాంప్‌లెట్స్ పంచి కస్టమర్లను ఆకర్షించాడు. పైగా ఆ నోటా.. ఈ నోటా వార్త కూడా జనాల్లోకి చేరువైంది. ఇంకేముంది తండోపతండాలుగా సెల్‌ఫోన్ దుకాణానికి జనం పోటెత్తారు. తెల్లారేసరికి షాపు దగ్గరకు పెద్ద ఎత్తున జనం గుమిగూడటంతో ఒక్కసారిగా ట్రాఫిక్‌కు (traffic) తీవ్ర అంతరాయం ఏర్పడింది. పైగా కస్టమర్లు కూడా రహదారిపై రచ్చ రచ్చ చేసి గందరగోళం సృష్టించారు. ఇది కాస్త పోలీసుల దాకా చేరడంతో రంగంలోకి దిగిన ఖాకీలు బంపరాఫర్ ప్రకటించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) భదోహిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇది కూడా చదవండి: Couple: కోర్టు మెట్లెక్కిన కొత్త పెళ్లి జంట.. మా ప్రాణాలతో వాళ్లు చెలగాటం ఆడారు.. రూ.40 కోట్ల నష్టపరిహారం ఇప్పించండంటూ..'

రాజేశ్‌ మౌర్య అనే వ్యక్తి సెల్‌ఫోన్‌ల షాప్‌ నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో తన దుకాణంలో మార్చి 3 నుంచి 7వ తేదీల మధ్య సెల్‌ఫోన్‌ కొంటే రెండు బీర్లు ఉచితంగా ఇస్తానని ప్రకటించాడు. ఇలా ఊరంతా పోస్టర్లు అతికించి, పాంప్‌లెట్స్‌ పంచాడు. దీంతో కస్టమర్లంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర విఘాతం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి గుంపును చెదరగొట్టారు. అనంతరం ఐపీసీ సెక్షన్‌ 151 కింద ప్రజాశాంతికి విఘాతం కలిగించిన నేరం కింద మౌర్యను అరెస్ట్‌ చేసి మొబైల్ దుకాణాన్ని సీజ్ చేశారు.

Updated Date - 2023-03-07T16:07:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising