ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: అనుకోకుండా తారసపడ్డ రెండు కోతులు.. ఎలా పలకరించుకున్నాయో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే...

ABN, First Publish Date - 2023-12-12T19:37:36+05:30

మనషుల్లో రోజుకు రోజుకూ మానవత్వం కరువవుతోంది. కొందరైతే సొంత కుటుంబ సభ్యుల పట్ల కూడా దారుణంగా వ్యవహరిస్తుంటారు. ఇంకొందరైతే చిన్న పిల్లల పట్ల కూడా రాక్షసంగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం. ఇలాంటి వారిని చూసినప్పుడు..

మనషుల్లో రోజుకు రోజుకూ మానవత్వం కరువవుతోంది. కొందరైతే సొంత కుటుంబ సభ్యుల పట్ల కూడా దారుణంగా వ్యవహరిస్తుంటారు. ఇంకొందరైతే చిన్న పిల్లల పట్ల కూడా రాక్షసంగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం. ఇలాంటి వారిని చూసినప్పుడు.. ‘‘వీరి కంటే జంతువులు నయం’’.. అని అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు కొన్ని జంతువులు.. మనుషులకు కనువిప్పు కలిగించే విధంగా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, కోతులకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అనుకోకుండా తారసపడ్డ రెండు పరస్పరం చూపించుకున్న అభిమానం చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రెండు కోతులు (Monkeys) తమ పిల్లలను వీపుపై పెట్టుకుని వెళ్తుంటాయి. అయితే అనుకోకుండా ఇవి రెండూ ఒకే చోట తారసపడతాయి. ఎదురుపడ్డ కోతులు ఒకదాని ఇంకొకటి చూసుకుని సంతోషంతో ఉప్పొంగిపోయాయి. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాయో ఏమో గానీ.. ‘‘ఎన్నాళ్ల తర్వాత చూస్తున్నాను.. ఎలా ఉన్నావ్’’.. అన్నట్టుగా రెండు కోతులు కౌగిలించుకుని ప్రేమ కురిపించుకున్నాయి. ఓ కోతి మరో కోతి పిల్లను ఎత్తుకుని ‘‘ఎలా ఉన్నావ్.. చిన్నా’’.. అన్నట్లుగా ముద్దాడుతుంది.

Viral Video: ఇలాంటి వాడిని ఏం చేయాలి.. ప్రేమగా దగ్గరికొచ్చిన కుక్కపిల్లను ఏం చేశాడో చూడండి..

తర్వాత యథావిధిగా ‘‘బాయ్... బాయ్’’.. అంటూ తలో దారిన వెళ్లిపోతాయి. కోతులు కలుసుకున్న సమయంలో పక్కన ఉన్న కొందరు సమీపానికి వచ్చినా.. ఆ కోతలు అదేమీ పట్టించుకోవు. ఈ ఘటనను చూసి ముచ్చటపడిన కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ కోతులను చూస్తే.. ఎంతో ముచ్చటేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రేమ మనుషుల్లో మచ్చుకైనా లేదు’’.. అంటూ మరికొందరు, ‘‘కల్మషం లేని ప్రేమ అంటే ఇదే’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పెళ్లిలో వధువు డాన్స్ చేస్తుండగా.. సడన్‌గా ఈ డ్రమ్మర్ చేసిన పనికి అంతా షాక్..

Updated Date - 2023-12-12T19:37:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising