Marriage: పెళ్లి వేడుకలో సడన్‌గా పవర్ కట్.. చిమ్మచీకట్లో బంధువుల హాహాకారాలు.. కరెంట్ వచ్చాక చూస్తే వధూవరులపై యాసిడ్ దాడి..!
ABN, First Publish Date - 2023-04-20T16:15:16+05:30
అథితులందరితో కళ్యాణ మంటపం కళకళలాడుతోంది. ఇంతలో వధూవరులు సంప్రదాయ దస్తులు ధరించి పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. అంతా ఆనందంగా ఉన్న ఈ సమయంలో ఉన్నట్టుండి అనుకోని ఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడకలో..
అథితులందరితో కళ్యాణ మంటపం కళకళలాడుతోంది. ఇంతలో వధూవరులు సంప్రదాయ దస్తులు ధరించి పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. అంతా ఆనందంగా ఉన్న ఈ సమయంలో ఉన్నట్టుండి అనుకోని ఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడకలో సడన్‌గా కరెంట్ కట్ అయింది. కాసేపటికి చిమ్మ చీకటిలో బంధువులంతా హాహాకారాలు చేశారు. ఏం జరుగుతుందో అర్థం కాక మిగతా వారంతా భయంతో అటూ ఇటూ పరుగులు తీశారు. కరెంట్ రాగానే వధూవరులపై యాసిడ్ డాడి జరగడం చూసి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) బస్తర్ జిల్లా భన్‌పురి పరిధి అమబల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సునీతా కశ్యప్ అనే యువతికి, సుధాపాల్ ప్రాంతానికి చెందిన దమ్రు బాఘెల్ అనే యువకుడితో వివాహం (marriage) నిశ్చయమైంది. బుధవారం వివాహం ఉండడంతో బంధువులంతా గ్రామానికి చేరుకున్నారు. వధూవరులు సాంప్రదాయ దుస్తుల్లో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ మంటపం (wedding hall) మొత్తం అతిథులు, సన్నిహితులు, స్నేహితులతో కళకళలాడుతోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా కరెంట్ పోయింది. దీంతో మంటపంలో ఒక్కసారిగా నిశ్చబ్ధం ఆవరించింది. కొందరు పవర్ ఆన్ చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఈ సమయంలో ఓ వ్యక్తి సడన్‌గా లోపలికి వచ్చి వధూవరులపై యాసిడ్ (Acid attack on bride and groom) చల్లి పారిపోయాడు.
వధూవరులతో పాటూ సుమారు పది మందిపై యాసిడ్ పడడంతో బిగ్గరగా కేకలు పెట్టారు. దీంతో మంటపంలోని వారంతా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో అంతా అటూ, ఇటూ పరుగులు పెడుతున్నారు. కాసేపటికి పవర్ రావడంతో జరిగిన విషయం అర్థమైంది. వెంటనే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అదృష్టవశాత్తు వారంతా స్వల్ప గాయాలతో బయటపడడంతో బంధువులంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. యాసిడ్ దాడి చేసిన వ్యక్తి వరుడి తరపు బంధవు అని అనుమానిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Updated Date - 2023-04-20T16:15:16+05:30 IST