Deepavali Firecrackers: తండ్రి షాపులో దీపావళి బాంబులను అమ్ముతూ.. ఆ 15 ఏళ్ల కుర్రాడు చేసిన ఒక్క మిస్టేక్‌తో..!
ABN , First Publish Date - 2023-11-13T21:14:19+05:30 IST
తండ్రి షాపులో టపాసుల నాణ్యత కస్టమర్ల ముందే పరీక్షించేందుకు ఓ బాలుడు చేసిన ప్రయత్నం భారీ ప్రమాదానికి దారి తీసింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి పురస్కరించుకుని ఆ వ్యక్తి ఎప్పటిలాగే తన షాపులో టపాసులు అమ్మడం ప్రారంభించాడు. అతడి వెంట కొడుకు కూడా ఉన్నాడు. తన వద్ద ఉన్న టపాసులు మంచి నాణ్యమైనవని తండ్రి కస్టమర్లకు చెప్పుకుపోతున్నాడు. ఇంతలో టీనేజ్ బాలుడు కస్టమర్ల ముందు వాటి నాణ్యత పరీక్షించాడు. ఈ ప్రయత్నం చివరకు దారుణానికి దారితీసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో(Uttarpradesh) ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కాన్పూర్ దేహత్ జిల్లా(Kanpur Dehat) రసూలాబాద్ టౌన్‌లోని ఆజాద్ చౌక్ ప్రాంతంలో అబ్దుల్ దిల్షాద్ టపాసులు అమ్మడం ప్రారంభించాడు. అతడి వెంట ఉన్న కుమారుడు సూఫీయాన్ ఓ బాంబు నాణ్యత పరీక్షించే నిమిత్తం దాన్ని వెలిగించాడు. అది ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న బాంబుల సంచీలోకి ఓ నిప్పురవ్వ పడటంతో అవన్నీ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయాయి. పేలుడు ధాటికి సూఫియాన్ కొన్ని అడుగుల దూరంలో ఎగిరి పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి దుస్తులన్నీ చిరిగిపోయాయి. బాలుడికి సమీపంలో నిలబడ్డ మరో నలుగురు వ్యక్తులు కూడా గాయపడ్డారు. స్థానికులు వెంటనే బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు(Kid test crackers, suffers serious injuries in explosion).
Google: అలర్ట్.. గూగుల్ కీలక నిర్ణయం! మీకు ఒకటికంటే ఎక్కువ గూగుల్ అకౌంట్స్ ఉన్నాయా? అయితే..
అయితే, అది సాధారణ టపాసులు పేలిన శబ్దంలా లేదని స్థానికులు చెబుతున్నారు. ఆ శబ్ద తీవ్రతకు తమ గుండెలు అదిరిపోయాయని, చాలా సేపటికి గానీ తాము కోలుకోలేకపోయామని చెప్పారు. మరోవైపు, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.