Shocking: శాస్త్రవేత్తలనే అవాక్కయ్యేలా చేస్తున్న వింత జీవి.. ఇది మత్స్యకన్యనా..? లేక మమ్మీనా..?
ABN, First Publish Date - 2023-10-25T17:30:29+05:30
‘‘తెలిసింది గోరంతే.. తెలియనిది కొండంత’’.. అన్నట్లుగా ఈ విశ్వంలో మనిషికి తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. టెక్నాలజీ ఇంతలా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలోనూ కొన్ని వింత వస్తువులు, వింత వింత జీవులు.. శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. వాటికి...
‘‘తెలిసింది గోరంతే.. తెలియనిది కొండంత’’.. అన్నట్లుగా ఈ విశ్వంలో మనిషికి తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. టెక్నాలజీ ఇంతలా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలోనూ కొన్ని వింత వస్తువులు, వింత వింత జీవులు.. శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. వాటికి సంబంధించిన రహస్యాలు తెసుకునేందుకు ఏళ్లకు ఏళ్లు పరిశోధనలు చేయాల్సిన పరిస్థితి వస్తుంటుంది. తాజాగా, ఇలాంటి వింత జీవికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వింజ జీవిని చూసిన వారంతా ఇది మత్స్యకన్యనా..? లేక మమ్మీనా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో ఓ వింత జీవికి సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వింత జీవిని అమెరికన్ (American) నావికుడైన ఓ వ్యక్తి.. 1960 జపాన్ నుంచి ఓహియోలోని స్ప్రింగ్ ఫీల్డ్‌లోని క్లార్క్ కౌంటీ హిస్టారికల్ సొసైటీకి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు ఈ వింత జీవిపై (strange creature) వివిధ రకాల పరిశోధనలు (Research) చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకూ దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మాత్రం రాబట్టలేకపోయారు. ఈ వింత జీవికి సంబంధించిన పంజాతో పాటూ దంతాలు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి. అలాగే మెడ నుంచి కడుపు భాగం చేప ఆకారాన్ని పోలి ఉంది. మత్స్యకన్య, మమ్మీ అని పిలుస్తున్న ఈ జీవి గురించి క్షుణ్ణంగా తెలుసుకునేందుకు CT స్కానింగ్ కూడా చేశారు.
స్కానింగ్ రిపోర్టులను పరిశీలించిన వైద్యులు.. ఈ వింత జీవి మూడు వేర్వేరు జాతులుగా కనిపిస్తోందని చెప్పారు. తల కోతిని పోలి ఉందని, చేతులేమో మొసలి, బల్లిని.. అలాగే చేపను పోలినట్లుగా తోక ఉందని తెలిపారు. ఇది ఏ జాతికి చెందినదో ఇప్పటివరకూ తెలియరాలేదని, ఈ జీవికి సంబంధించిన పూర్తి రహస్యాలను తెలుసుకునేందుకు విస్తృత పరిశోధనలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు (Scientists) పేర్కొన్నారు. కాగా, ఈ వింత జీవికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఇదేంటీ మరీ భయంకరంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇంతకీ ఇది మత్స్యకన్యనా..? లేక మమ్మీనా..?’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-10-25T17:30:29+05:30 IST