Viral Video: ప్రభుత్వ ఆఫీసుల్లో మీరూ ఇలాంటి పని చేస్తున్నారా.. ఇక్కడ అధికారులు ఏకంగా బోర్డే పెట్టేశారు..
ABN, First Publish Date - 2023-04-10T20:22:18+05:30
కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, కార్యాలయాలు.. అవినీతికి, నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంటాయి. అధికారులు, సిబ్బంది కారణంగా ప్రజలు ఇబ్బందులు పడడం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి కూడా..
కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, కార్యాలయాలు.. అవినీతికి, నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంటాయి. అధికారులు, సిబ్బంది కారణంగా ప్రజలు ఇబ్బందులు పడడం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి కూడా అధికారులకు తలనొప్పులు ఎదరవుతుంటాయి. ప్రస్తుతం చెప్పుకోబోయే ప్రభుత్వ కార్యాలయమే ఇందుకు నిదర్శనం. రాజస్థాన్‌లోని ఓ ప్రభుత్వ కార్యాలయ అధికారులకు.. ప్రజల నిర్వాకం పెద్ద తలనొప్పిగా మారింది. చివరకు సూచిక బోర్డులు ఏర్పాటు చేసినా ఫలితం మాత్రం దక్కలేదు. ఇంతకీ విషయం ఏంటంటే..
రాజస్థాన్‌లోని (Rajasthan) జోధ్‌పూర్ జిల్లాలోని రిజిస్ట్రార్ ఆఫీసులో (Registrar Office) ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని బ్లూ సిటీ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral video) అవుతోంది. ఈ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం అధిక సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఇది సర్వసధారణమే అయినా వచ్చే వారిలో కొందరు చేసిన నిర్వాకమే ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశానికి కారణమైంది. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పనుల నమిత్తం వచ్చే వారిలో నిరక్ష్యరాస్యులు (illiterate) వేలి ముద్రలు వేయడం అందరికీ తెలిసిందే.
ఈ ఆఫీసుకు వచ్చే వారు కూడా అందరిలాగే పేపర్లపై వేలిముద్రలు (Fingerprints) వేస్తారు. కానీ అనంతరం బొటనవేలికి అంటిని రంగును చెరిపేందుకు గోడను వాడుకున్నారు. వచ్చిన వారంతా బొటనవేలిని తెల్లటి గోడకు రాయడంతో మొత్తం రంగులమయం అయింది. ఆఖరికి ఆఫీసు తలుపులకు కూడా వేలి ముద్రల రంగును మూసేశారు. సిబ్బంది ఎన్నిసార్లు చెరిపేసినా ప్రజలు మళ్లీ మళ్లీ అలాగే చేస్తుండడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో చివరకు సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. ‘‘గోడలను పాడు చేయకండి’’.. అంటూ బోర్డు తగిలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
Updated Date - 2023-04-10T20:29:40+05:30 IST