ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: గుడికి దగ్గర్లో.. రోడ్డు పక్కన టీ షాపు నడుపుతున్న ఈ మహిళ.. ఆయనకు స్వయానా చెల్లెలు అని తెలిసి అవాక్కైన భక్తులు..!

ABN, First Publish Date - 2023-07-04T19:23:07+05:30

ప్రస్తుత సమాజంలో చాలా మంది అందరి ముందూ విలాసవంతంగా కనిపించాలనే ఉద్దేశంతో తమ స్థాయికి మించి ఖర్చు చేస్తుంటారు. గొప్పలకు పోయి చివరకు అప్పులపాలవుతుంటారు. ఇక సినీ, రాజకీయ నాయకులకు చెందిన కుటుంబ సభ్యుల జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుత సమాజంలో చాలా మంది అందరి ముందూ విలాసవంతంగా కనిపించాలనే ఉద్దేశంతో తమ స్థాయికి మించి ఖర్చు చేస్తుంటారు. గొప్పలకు పోయి చివరకు అప్పులపాలవుతుంటారు. ఇక సినీ, రాజకీయ నాయకులకు చెందిన కుటుంబ సభ్యుల జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొందరు మాత్రం ఎంతో డబ్బు, పేరుప్రఖ్యాతలు ఉన్నా చాలా సింపుల్‌గా జీవిస్తుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే మహిళ కూడా ఈ కోవకే చెందుతుంది. కొండలో ఆలయానికి దగ్గరలో టీ షాపు నడుపుతున్న ఈ మహిళ.. ఓ ప్రముఖ వ్యక్తికి చెల్లెలు అని తెలుసుకుని అంతా అవాక్కవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) పౌఢీ అనే ప్రాంతంలోని కొండపై భువనేశ్వరి ఆలయం ఉంది. అక్కడికి వెళ్లిన చాలా మంది భక్తులు.. ఆలయ సమీపంలో ఉన్న చిన్న టీదుకాణంలోకి విధిగా వెళ్లి వస్తుంటారు. టీ దుకాణం నడుపుతున్న శశి పాయల్ అనే మహిళ.. ఉత్తరప్రదేశ్ సీఎం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Uttar Pradesh Chief Minister Yogi Adityanath) చెల్లెలు కావడమే ఇందుకు కారణం. దేశంలోనే ప్రముఖుల్లో ఒకరైన యోగీ ఆదిత్యనాథ్ చెల్లెలు.. ఇలా సాదాసీదా జీవనం గడపడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సరైన రోడ్డు మార్గం లేని కొండపై, చిన్న దుకాణం నడుపుతున్న శశిపాయల్.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Auto Drivers: ఐఫోన్‌ను పోగొట్టుకున్న ఓ యువతికి షాకింగ్ అనుభవం.. తనను దించేసిన ఆటో డ్రైవర్‌ను వెతుక్కుంటూ వెళ్తే..!

ఆమె గురించి తెలుసుకున్న వారంతా అక్కడికి వెళ్లి.. సీఎం యోగి గురించి, కుటుంబ సభ్యుల గురించి అడిగి తెలుసుకుంటుంటారు. తన అన్న అతి పెద్ద రాష్ట్రానికి సీఎం అయినా ఆమె.. ఏమాత్రం గర్వం లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంటారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉత్తరాఖండ్‌లోని పౌఢీలో జన్మించారు. ఏడుగురు తోబుట్టువుల్లో పెద్దవారైన శశిపాయల్.. స్థానిక కొఠార్ గ్రామానికి చెందిన పురాన్ సింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. శశిపాయల్ గురించి తెలియజేస్తూ.. మాజీ ఎమ్మెల్యే దినేశ్ చౌదరి తన ట్విట్టర్ ఖాతాలో (Twitter account) వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Viral: కారును పార్క్ చేసేంత స్థలంలో చిన్న ఇల్లు.. అద్దె ఏకంగా రూ.1.30 లక్షలు.. ఏరి కోరి మరీ అక్కడే ఎందుకు ఉంటోందంటే..!

Updated Date - 2023-07-04T19:51:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising