ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: బుడ్డోన్ని డబ్బాలో మూసేసి.. అలా తోశావేంట్రా.. చివరకు ఏమైందో చూడండి..

ABN, First Publish Date - 2023-03-25T20:37:23+05:30

తెలిసీ తెలీని వయసులో పిల్లలు చేసే పనులు విచిత్రంగా ఉంటాయి. వారి చేష్టలు చూసేందుకు నవ్వు తెప్పించినా.. కొన్నిసార్లు అవి ప్రమాదానికి దారి తీస్తుంటాయి. పెద్దల పర్యవేక్షణ లేని సమయంలో కొందరు పిల్లలు.. ఆడుకునే క్రమంలో ప్రమాదవశాత్తు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తెలిసీ తెలీని వయసులో పిల్లలు చేసే పనులు విచిత్రంగా ఉంటాయి. వారి చేష్టలు చూసేందుకు నవ్వు తెప్పించినా.. కొన్నిసార్లు అవి ప్రమాదానికి దారి తీస్తుంటాయి. పెద్దల పర్యవేక్షణ లేని సమయంలో కొందరు పిల్లలు.. ఆడుకునే క్రమంలో ప్రమాదవశాత్తు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు చాలా చూశాం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆడుకునే క్రమంలో తమ్ముడిని ప్లాస్టిక్ డబ్బాలో మూసేసి సడన్‌గా కిందకు తోసేశాడు. ఈ ఘటనలో చివరకు ఏమైందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral videos) తెగ చక్కర్లు కొడుతోంది. ఇద్దరు పిల్లలు (children) ఆడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో వారికి ప్లాస్టిక్ డబ్బా (Plastic box) కనిపిస్తుంది. దీంతో దాంతో విచిత్రమైన ఆట (Games) మొదలెట్టారు. తమ్ముడిని డబ్బాలో కూర్చోబెట్టిన బాలుడు.. మూత వేసి సడన్‌గా మెట్లపై నుంచి తోసేస్తాడు. దీంతో ఆ డబ్బా పల్టీలు కొట్టుకుంటూ కిందకు వచ్చి పడుతుంది. పాపం! లోపల పిల్లాడు ఏమయ్యాడో.. అని అనిపిస్తుంది.

విషం పనిచేయకుంటే.. వెంటనే ఉరేసుకోమంటూ ప్రియుడికి సలహా.. ఆమె ఎందుకు ఇలా చేసిందా అని ఆరాతీయగా..

కానీ విచిత్రంగా అందులోంచి బయటికి వచ్చిన బుడ్డోడు.. సంతోషంతో కెవ్వుమంటూ కేకలు వేస్తాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకంటే తెలీదు.. వీడియో తీసే వాళ్లకైనా బుద్ధి ఉండాలిగా.. అంటూ కొందరు, పిల్లాడికి ఏమైనా అయ్యుంటే ఏంటి పరిస్థితి.. అంటూ మరికొందరు, ఇలాంటి సమయాల్లో పెద్దల పర్యవేక్షణ ఉండాలి.. అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral news: టాటూ ఆర్టిస్టు వద్దకు వెళ్లిన ప్రియురాలు.. ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కాసేపటికి ప్రియుడు వెళ్లి చూడగా..

Updated Date - 2023-03-25T20:38:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising