కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Buffalo vs Tiger: ఒకే ఒక్క పులి.. పదుల సంఖ్యలో గేదెలు.. చివరకు జరిగింది చూస్తే మతిపోవడం ఖాయం..!

ABN, First Publish Date - 2023-08-03T16:07:40+05:30

‘‘నీట కుంజరమును నిలబెట్టు మొసలిని.. బైట పిచ్చి కుక్క పరిభవించు’’.. అన్న సామెత చందంగా నీటిలో ఉన్న మొసలి నుంచి తప్పించుకోవడం ఏనుగు వల్ల కూడా కాదు. అదే మొసలి బయటికి వస్తే కుక్క చేతిలో కూడా ఓడిపోవాల్సి వస్తుంది. స్థాన బలం లేని చోట విర్రవీగకూడదని దీని అర్థం. ఇందుకు నిదర్శనంగా...

Buffalo vs Tiger: ఒకే ఒక్క పులి.. పదుల సంఖ్యలో గేదెలు.. చివరకు జరిగింది చూస్తే మతిపోవడం ఖాయం..!

‘‘నీట కుంజరమును నిలబెట్టు మొసలిని.. బైట పిచ్చి కుక్క పరిభవించు’’.. అన్న సామెత చందంగా నీటిలో ఉన్న మొసలి నుంచి తప్పించుకోవడం ఏనుగు వల్ల కూడా కాదు. అదే మొసలి బయటికి వస్తే కుక్క చేతిలో కూడా ఓడిపోవాల్సి వస్తుంది. స్థాన బలం లేని చోట విర్రవీగకూడదని దీని అర్థం. ఇందుకు నిదర్శనంగా మన చుట్టూ ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం ఓ పులికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. జన సంచార ప్రాంతంలో గేదెల మంద వద్దకు వచ్చిన పులి వాటిపై దాడి చేయాలని చూస్తుంది. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పులి జన సంచార ప్రాంతాల్లోకి చొరబడుతుంది. అక్కడ దానికి ఓ గేదెల మంద కనిపిస్తుంది. దీంతో వాటిపై దాడి చేయాలని చూస్తుంది. అయితే గుంపులుగా ఉన్న గేదెలన్నీ ఒక్క చోటికి చేరి పులిపై (Buffalos attack on tiger) ఎటాక్ చేస్తాయి. ‘‘మా ఏరియాకొచ్చి.. మాపైనే దాడి చేస్తావా’’.. అన్నట్లుగా పులిని అటూ ఇటూ తిప్పుతూ కొమ్ములతో ఎత్తిపడేశాయి. ఈ ఘటనతో చుట్టు పక్కల ఉన్న వారంతా షాక్ అయ్యారు.

Crime news: గంటల వ్యవధిలో ఇద్దరు కూతుళ్లకు కడుపు నొప్పి.. కంగారుగా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చివరకు వారు చెప్పింది ఏంటంటే..

దగ్గరికి వెళ్తే ఎక్కడ పులి తమపై దాడి చేస్తుందోనన్న భయంతో దూరంగా ఉండిపోతారు. గేదెలతో పోరాడి అలసిపోయిన పులి.. చివరకు ఇక నా వల్ల కాదు.. అనుకుంటూ ఒకేచోట పడిపోతుంది. అయినా గేదెలు దాన్ని వదలకుండా చుట్టూ చేరి భయపెడతాయి. ఇలా చాలా సేపు వాటి మధ్య పోరాటం జరుగుతుంది. కొందరు స్థానికులు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో చివరకు అక్కడికి చేరుకున్న అధికారులు.. పులిని పట్టుకుని తీసుకెళ్లారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Marriage: పెళ్లి వేడుకలోనే వరుడిని చితకబాదిన వధువు.. బంధువులంతా చూస్తుండగానే కింద పడేసి..!

Updated Date - 2023-08-03T16:07:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising