ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: దుండగుడు బ్యాగు లాక్కోవడంతో.. పోతేపోనీ అని వదిలేసిన మహిళ.. అయితే ఇలా జరుగుతుందని ఇద్దరూ ఊహించలేదు..

ABN, First Publish Date - 2023-07-12T17:59:29+05:30

తప్పు చేసిన వారు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదు. అయితే కొన్నిసార్లు నేరాలు చేసిన వెంటనే.. నిమిషాల వ్యవధిలో శిక్షలు అనుభవిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తప్పు చేసిన వారు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదు. అయితే కొన్నిసార్లు నేరాలు చేసిన వెంటనే.. నిమిషాల వ్యవధిలో శిక్షలు అనుభవిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను బెదిరించి బ్యాగు లాక్కెళ్తాడు. అయితే ఆ వెంటనే చోటు చేసుకున్న ఘటనతో ఇద్దరూ షాక్ అవుతారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుంటుంది. అంతలో ఓ వ్యక్తి బైకుపై అటుగా వెళ్తాడు. మహిళ ఒంటరిగా వెళ్తుండడాన్ని గమనించిన అతను.. బైకు ఆపి ఆమె వద్దకు వెళ్తాడు. అతను దగ్గరికి రావడాన్ని గమనించిన మహిళ పారిపోయేందుకు ప్రయత్నిస్తుంది. అయినా అతను వదలకుండా ఆమెను బెదిరించి బ్యాగు లాక్కుంటాడు. దీంతో భయపడిపోయిన ఆమె.. బ్యాగుపై ఆశలు వదులుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చూస్తుంది. మరోవైపు దుండగుడు బ్యాగు తీసుకుని బైకుపై వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అప్పటికే అటుగా వస్తున్న కారు యజమాని ఇదంతా గమనించి, దుండగుడి బైకును ఢీకొంటాడు. దీంతో అతను ఎగిరి పక్కన పడతాడు.

Train Fighting: ఎన్నోసార్లు రైలు ప్రయాణాలు చేసి ఉంటారు కానీ.. ఇలాంటి సీన్ మాత్రం అస్సలు చూసి ఉండరు..!

అయినా మళ్లీ పైకి లేచి బైకును తీసుకుని పారిపోయే ప్రయత్నం చేస్తాడు. దీంతో కారు యజమాని మళ్లీ అతన్ని ఢీకొంటాడు. దూరంగా పడిపోయిన అతను.. మళ్లీ బైకును పైకి లేపి అక్కడి నుంచి వెళ్లాలని చూస్తాడు. ఆగ్రహించిన కారు యజమాని మూడోసారి మరింత బలంగా బైకును ఢీకొంటాడు. దీంతో బైకు మీద పడి అతను స్వల్పంగా గాయపడతాడు. అయినప్పటికీ బైకును స్టార్ట్ చేసి అక్కడి నుంచి పారిపోతాడు. చివరగా కారు యజమాని వాహనాన్ని రివర్స్‌లో నడుపుతూ బైకును వెంటపడతాడు. ఇదంతా గమనిస్తున్న మహిళ చివరగా అక్కడ పడిపోయిన తన బ్యాగును తీసుకుని వెళ్లిపోతుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘‘ఇలాంటి వాళ్లకు ఇలాగే జరగాలి’’.. అంటూ కొందరు, కారు యజమానిని మెచ్చుకుంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Birth Day Gift: ఈ యువతి పుట్టిన రోజుకు కలలో కూడా ఊహించని గిఫ్ట్.. కేక్ పక్కనే వాటిని పెట్టి మరీ సెలబ్రేషన్స్..!

Updated Date - 2023-07-12T17:59:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising