ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఈ పిల్లికి మనిషి పూనాడా ఏంటీ.. అర్ధరాత్రి రోడ్డు మధ్యలో ఏం చేస్తుందో చూడండి..

ABN, First Publish Date - 2023-07-27T21:45:51+05:30

జంతువులు మనుషుల్లా ప్రవర్తించడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే కొన్ని జంతువులు కొన్నిసార్లు మనుషులను మక్కీ మక్కీకి దించేస్తుంటాయి. ఎక్కువగా చింపాంజీలు ఇలా చేయడం చూస్తూ ఉంటాం. అలాగే అప్పుడప్పుడూ కుక్కలు, కోతులు కూడా ఇలా చేస్తుంటాయి. ఇలాంటి..

జంతువులు మనుషుల్లా ప్రవర్తించడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే కొన్ని జంతువులు కొన్నిసార్లు మనుషులను మక్కీ మక్కీకి దించేస్తుంటాయి. ఎక్కువగా చింపాంజీలు ఇలా చేయడం చూస్తూ ఉంటాం. అలాగే అప్పుడప్పుడూ కుక్కలు, కోతులు కూడా ఇలా చేస్తుంటాయి. ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ పిల్లి చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఈ పిల్లికి మనిషి పూనాడా ఏంటీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. మనుషులు చేసే పనులను కొన్ని పిల్లులు కొంచెం అటూ ఇటుగా అనుకరించడం చూస్తూనే ఉంటాం. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ పిల్లి ఆశ్చర్యకరంగా అచ్చం మనుషులు చేసినట్లుగానే డాన్సు చేసింది. అర్ధరాత్రి రోడ్డు పైకి వచ్చిన ఓ తెల్లటి పిల్లి ఉన్నట్టుండి రోడ్డు (cat danced on the road) మధ్యలో కాలు కదిపింది. రెండు కాళ్ల మీద నిలబడి వెరైటీ స్టెప్పులు వేసింది. అది కూడా అచ్చం మనుషుల్లా అటూ ఇటూ తిరుగుతూ డాన్స్ చేసింది. ఆ సమయంలో ఎదురుగా మరో నల్లటి పిల్లి పరుగెత్తుకుంటూ వెళ్తుంటుంది.

Funny Video: ఈ యువతి జుట్టు ఇలా వెరైటీగా ఉండేసరికి.. తినొచ్చనుకున్న ఒంటె.. ఆమె దగ్గరకు రాగానే సడన్‌గా అటాక్.. చివరకు..!

అయినా ఎవరినీ పట్టించుకోకుండా ఈ పిల్లి డాన్స్ చేస్తూనే ఉంటుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో (CC camera) రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ పిల్లి సినిమాలు చూసి చెడిపోయింది’’., ‘‘ ఇది వెరైటీగా ఉన్నట్టుందే’’.. ‘‘వావ్! మనుషుల కంటే బాగా చేస్తోందే’’, ‘‘ఈ పిల్లికి బెస్ట్ డాన్సర్ అవార్డు ఇవ్వాల్సిందే’’, ‘‘ఈ వీడియో గ్రాఫిక్స్ అయ్యుంటుంది’’.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 17మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Marriage: పెళ్లి వేడుకలో ఫన్నీ గేమ్.. వరుడే గెలిచాడు కానీ.. పెళ్లయ్యాక అతడి పరిస్థితేంటో.. నెట్టింట పేలుతున్న సెటైర్లు..!

Updated Date - 2023-07-27T21:50:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising