ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: అసలు సిసలు పిల్లి నటనను ఎప్పుడైనా చూశారా.. బుడ్డోడి దృష్టి మళ్లించడానికి ఈ పిల్లి ఏం చేసిందో చూడండి..

ABN, First Publish Date - 2023-09-12T21:23:51+05:30

అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న పిల్లలు రెక్కలు వచ్చిన పక్షుల్లా అటూ ఇటూ తిరగడం చూస్తూనే ఉంటాం. ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎటెటో వెళ్లిపోతూ ఏవేవో ముట్టుకుంటూ ప్రమాదాలకు గురవుతుంటారు. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను చూసుకునేందుకు ప్రత్యేకంగా..

అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న పిల్లలు రెక్కలు వచ్చిన పక్షుల్లా అటూ ఇటూ తిరగడం చూస్తూనే ఉంటాం. ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎటెటో వెళ్లిపోతూ ఏవేవో ముట్టుకుంటూ ప్రమాదాలకు గురవుతుంటారు. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను చూసుకునేందుకు ప్రత్యేకంగా కేర్ టేకర్లను కూడా నియమించుకుంటుంటారు. కొందరు పిల్లలు ఆడుకునే సమయంలో సరదా ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ సమయంలో వారికి పెంపుడు పిల్లులు, కుక్కలు తోడైతే కామెడీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. బుడి బుడి అడుగులు వేస్తున్న ఓ పిల్లాడు (child) .. ఉయ్యాలను పట్టుకుని అడుగులో అడుగు వేస్తుంటాడు. అదే సమయంలో వారి పెంపుడు పిల్లి ఉయ్యాలపై పడుకుని విశ్రాంతి తీసుకుంటుంది. బుడ్డోడు అక్కడికి రావడం చూసి పిల్లికి (cat) సందేహం కలుగుతుంది. ఎక్కడ తనని పక్కకు పంపించి, ఉయ్యాలలో పడుకుంటాడో అని అనుకుని.. ఎలాగైనా పిల్లాడి దృష్టిని మరల్చాలని అనుకుంటుంది. ఉయ్యాల వద్దకు వచ్చిన బాలుడు.. పిల్లిని చూసి తాకాలని ప్రయత్నిస్తాడు.

Viral Video: టెక్నాలజీని వాడుకోవడం అంటే ఇదేనేమో.. ఇకపై రైల్వే రైల్వే స్టేషన్లలో అంతా ఇలాగే చేస్తారేమో..

అయితే అప్పటిదాకా కదులుతున్న పిల్లి.. పిల్లాడిని చూడగానే ఒక్కసారిగా బొమ్మలా మారిపోయి కదలకుండా అలాగే ఉండిపోతుంది. దీంతో కాసేపు దాన్ని గమనించిన పిల్లాడు.. అదేదో బొమ్మేమో అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇలా ఊయల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సమీపానికి రాగానే పిల్లి యథావిధిగా బొమ్మలా నటించడం.. యజమానికి తెగ నచ్చినట్లుంది. ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ పిల్లి నటనకు జాతీయ అవార్డు ఇచ్చినా తక్కువే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఉన్నట్టుండి వరుడి మొఖంలో తేడా గమనించిన వధువు.. పక్కన ఉన్న వ్యక్తిని కూడా వదలకుండా చివరికి ఏం చేసిందో చూడండి..

Updated Date - 2023-09-12T21:23:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising