కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crocodiles vs Chicken: చుట్టూ వందల కొద్దీ మొసళ్లు.. మధ్యలో ఇరుక్కుపోయిన కోడి.. చివరకు జరిగిందేంటో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-07-11T16:33:29+05:30

మొసలి చూడటానికి ఎంత భయంకరంగా ఉంటుందో.. దాని వేట అంతకంటే మరింత భయంకరంగా ఉంటుంది. పెద్ద పెద్ద జంతువులు సైతం మొసలికి ఆమడ దూరంలో ఉంటాయి. ఒక్కసారి దాని నోటికి చిక్కితే ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అయితే అప్పుడప్పుడూ ...

Crocodiles vs Chicken: చుట్టూ వందల కొద్దీ మొసళ్లు.. మధ్యలో ఇరుక్కుపోయిన కోడి.. చివరకు జరిగిందేంటో మీరే చూడండి..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొసలి చూడటానికి ఎంత భయంకరంగా ఉంటుందో.. దాని వేట అంతకంటే మరింత భయంకరంగా ఉంటుంది. పెద్ద పెద్ద జంతువులు సైతం మొసలికి ఆమడ దూరంలో ఉంటాయి. ఒక్కసారి దాని నోటికి చిక్కితే ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అయితే అప్పుడప్పుడూ కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఆహారం నోటి దాకా వచ్చి చేజారిపోతుంటుంది. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కోడి పొరపాటున వందల మొసళ్లు ఉన్న ప్రాంతంలోకి వెళ్తుంది. వాటి మధ్యలో ఇరుక్కుపోయి.. చివరకు ఆహారమయ్యే సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద నీటి కుంట వద్ద వందల కొద్దీ మొసళ్లు ఆహారం కోసం వేచి చూస్తూ ఉంటాయి. ఆ సమయంలో పొరపాటున ఓ కోడి వాటి మధ్యకు వెళ్తుంది. ఇంకేముందీ.. వెంటనే దాని నోట కరుచుకోవాలని ప్రయత్నిస్తాయి. నోరు తెరచి తీరా పట్టుకునే సమయంలో కోడి అలెర్ట్ అవుతుంది. ఒక్కసారిగా గాల్లోకి లేచి, వాటిని తప్పించుకుంటూ వెళ్తుంది. ఒకదాని తర్వాత మరోటి.. (Crocodile attack on chicken) ఇలా చాలా మొసళ్లు కోడిపై దాడికి దిగుతాయి.

Crime News: వివాహమైన ఏడాదికే కోడలికి షాకింగ్ అనుభవం.. ఎవరూ లేనప్పుడు మద్యం తాగమంటూ మామ చెప్పడంతో..

కానీ కోడి మాత్రం దేనికీ దొరక్కుండా.. మొసళ్ల నుంచి జాగ్రత్తగా తప్పించుకుంటూ ప్రహరీ గేటు వద్దకు వెళ్తుంది. ఇలా మొసళ్ల నుంచి తప్పించుకుని బయటికి వెళ్లిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కోడి చాలా యాక్టివ్‌గా ఉందే’’.. అని కొందరు, ‘‘మొసళ్లకే చుక్కలు చూపించిన కోడి’’.. అని మరికొందరు, ‘‘ఈ కోడికి భూమ్మీక నూకలు మిగిలున్నాయ్’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వారెవ్వా.. ఏం తెలివయ్యా సామీ.. మ్యాన్‌హోల్స్‌లో పడిపోయి ప్రాణాలు పోకుండా ఉండేందుకు..!

Updated Date - 2023-07-11T16:33:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising