ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: రైల్వే స్టేషన్‌లో దంపతుల మధ్య.. ఇలాంటి ఫైట్ ఇంతకు ముందెన్నడూ చూసుండరు..

ABN, First Publish Date - 2023-08-15T16:35:45+05:30

దంపతుల మధ్య గొడవలు సర్వసాధారణం. ఎంత అన్యోన్యంగా ఉన్నా సరే.. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో గొడవ మాత్రం కచ్చితంగా జరుగుతుంటుంది. చాలా గొడవలు పాల మీద పొంగులా కాసేపటికి సర్దుకుపోతుంటాయి. అయితే కొందరు దంపతుల మధ్య చాలా తీవ్ర స్థాయిలో...

దంపతుల మధ్య గొడవలు సర్వసాధారణం. ఎంత అన్యోన్యంగా ఉన్నా సరే.. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో గొడవ మాత్రం కచ్చితంగా జరుగుతుంటుంది. చాలా గొడవలు పాల మీద పొంగులా కాసేపటికి సర్దుకుపోతుంటాయి. అయితే కొందరు దంపతుల మధ్య చాలా తీవ్ర స్థాయిలో గొడవ జరుగుతుంటుంది. నువ్వా, నేనా అనే రేంజ్‌లో కొట్టుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం రైల్వే స్టేషన్‌లో దంపతుల మధ్య తలెత్తిన గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇలాంటి ఫైట్ గతంలో ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో (Viral video) ఓ వీడియో తెగ చక్కర్లు కోడుతోంది. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై (Railway station platform) దంపతులు రైలు కోసం వేచి చూస్తుంటారు. ఇంతలో రైలు వచ్చి ఆగుతుంది. అయితే ఈ సమయంలో వారి మధ్య ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. భార్యకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంటుంది. ఉన్నట్టుండి భర్తపై విరుచుకు పడుతుంది. ముంద ఫెడేల్‌మని భర్త తలపై (Wife assaults husband) చేత్తో గట్టిగా కొడుతుంది. ఈ షాక్ నుంచి అతను తేరుకోకముందే.. భర్త కాళ్లు పట్టుకుని పైకి ఎత్తి ధమేల్‌మని కింద పడేస్తుంది. అంతటితో ఆగకుండా అతడిపై కూర్చుని చేతులతో బాదుతూ ఉంటుంది.

Crime: అసలు వీడు మనిషేనా.. కాబోయే భార్య అన్న ఒకే ఒక్క మాటకు.. ఇంత పని చేస్తాడునుకోలేదు..

ఈ క్రమంలో కింద పడ్డ భర్త.. కోపంతో భార్య జుట్టు పట్టుకుని లాగుతాడు. తర్వాత ఆమె కూడా అతడి జుట్టు పట్టుకుని కొడుతుంది. ఇలా చాలా సేపు ఇద్దరూ తీవ్రంగా కొట్టుకుంటారు. అనూహ్య ఘటనకు అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే ఎవరూ వారిని విడిపించే ప్రయత్నం మాత్రం చేయరు. కొందరు ఈ కొట్టాటను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వీరిని ఒలింపిక్స్‌కు పంపించాలి’’.. అని కొందరు, ‘‘కొత్తరకం WWE ఛాంపియన్‌ఫిప్’’.. అని మరికొందరు, ‘‘వామ్మో! ఈమెను చూస్తుంటే భయమేస్తోంది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అదృష్టం అంటే ఈ కప్పదే.. దాదాపు మింగేస్తున్న సమయంలో పాము నుంచి ఎలా తప్పించుకుందంటే..

Updated Date - 2023-08-15T16:35:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising