Cow Video: వారెవ్వా.. ఈ అవు చేసిన పనేంటో చూస్తే గుండె తరుక్కుపోవడం ఖాయం.. లేగ దూడను కాపాడిన వ్యక్తిని చూడగానే..!
ABN, First Publish Date - 2023-06-23T21:51:48+05:30
సాయం చేసిన మనిషికి తిరిగి సాయం చేయకపోగా.. కనీసం కృతజ్ఞతలు కూడా తెలపని మనుషులు ఉన్న నేటి సమాజంలో జంతువులను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఇనుప కంచెలో ఇరుక్కున్న జింకను కాపాడిన వ్యక్తికి ఇంటికి.. తర్వాత అదే జింక వెళ్లి తన ప్రేమను వ్యక్తం చేయడం చూశాం. గోతిలో..
సాయం చేసిన మనిషికి తిరిగి సాయం చేయకపోగా.. కనీసం కృతజ్ఞతలు కూడా తెలపని మనుషులు ఉన్న నేటి సమాజంలో జంతువులను చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఇనుప కంచెలో ఇరుక్కున్న జింకను కాపాడిన వ్యక్తికి ఇంటికి.. తర్వాత అదే జింక వెళ్లి తన ప్రేమను వ్యక్తం చేయడం చూశాం. గోతిలో పడిన ఏనుగును బయటికి తీయగా... కృతజ్ఞతగా జేసీబీకి ముద్దులు పెట్టిన ఏనుగును కూడా గతంలో చూశాం. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. లేగ దూడను కాపాడిన వ్యక్తిని చూడగానే ఆవు చేసిన పని చూస్తే గుండె తరుక్కుపోవడం ఖాయం..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral video) అవుతోంది. ఓ ఆవు లేగదూడకు (cow given birth to a calf) జన్మనిస్తుంది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ ఉండరు. అయితే అక్కడే ఉన్న ఓ వ్యక్తి గమనించి.. అక్కడి వస్తాడు. ఆవు ప్రసవించే క్రమంలో (man helped the cow) సహాయపడతాడు. తర్వాత లేగదూడను జాగ్రత్తగా ఓ దుప్పటిపై పడుకోబెడతాడు. ఇదంతా గమనించిన ఆవు.. తనకు సాయం చేసిన వ్యక్తిని చూడగానే ప్రేమ పొంగుకొస్తుంది. అతడి చేతిపై ముద్దులు (kisses) పెడుతుంది. ఆవు చూపిన ప్రేమకు అతను కూడా భావోద్వేగానికి గురవుతాడు. తిరిగి ఆవుకు ముద్దులు పెడుతూ ప్రతిస్పందిస్తాడు.
తర్వాత లేగ దూడపై దుప్పటి కప్పాలని ప్రయత్నిస్తుండగా.. ఆవు కూడా నోటితో దుప్పటి పట్టుకుని లేగదూడపై కప్పేందుకు సాయం చేస్తుంది. తర్వాత అతడి మొఖంపై ముద్దు పెట్టి థ్యాంక్స్ చెబుతుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. భావోద్వేగంతో కూడిన కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ ఆవు మనసు ఎంత గొప్పది’’.. అంటూ కొందరు, ‘‘జంతువులను చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-06-23T21:52:48+05:30 IST