ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: పార్సిల్ తీసుకొచ్చి ఇంటి తలుపు ముందు పెట్టిన డెలివరీ బాయ్.. వెళ్తూ వెళ్తూ ఎంత పని చేశాడో చూడండి..

ABN, First Publish Date - 2023-09-13T21:55:17+05:30

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సమయంలో కొన్నిసార్లు చిత్రవిచిత్రం ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చివరి నిముషంలో ఆర్డర్‌ని క్యాన్సిల్ చేసేవారు కొందరైతే.. మరికొందరు ఫుడ్ తీసుకొచ్చే క్రమంలో మధ్యలోనే దాన్ని ఖాళీ చేసేస్తుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు..

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సమయంలో కొన్నిసార్లు చిత్రవిచిత్రం ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చివరి నిముషంలో ఆర్డర్‌ని క్యాన్సిల్ చేసేవారు కొందరైతే.. మరికొందరు ఫుడ్ తీసుకొచ్చే క్రమంలో మధ్యలోనే దాన్ని ఖాళీ చేసేస్తుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పార్సిల్ తీసుకొచ్చి ఇంటి తలుపు ముందు పెట్టిన డెలివరీ బాయ్.. వెళ్తూ వెళ్తూ ఏం చేశాడంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఫ్లోరిడాకు (Florida women) చెందిన ఓ మహిళ తన 13 ఏళ్ల కొడుకుతో కలిసి నివాసం ఉంటోంది. ఇదిలావుండగా, ఇటీవల తల్లీకొడుకు కలిసి తమకు నచ్చిన ఫుడ్‌ని ఆన్‌లైన్‌లో (Food order) ఆర్డర్ పెట్టారు. వారు ఆర్డర్ ఆర్డర్ ధర $30 (రూ.2,488.53)కాగా, అందులో రూ.248లు టిప్ కూడా ఇచ్చారు. అయితే ఆర్డర్ పికప్ చేసుకున్న వ్యక్తికి ఇది ఏమాత్రం నచ్చలేదు. పార్సిల్‌ను అంత దూరం మోసుకెళ్తే... ఇంత తక్కువ టిప్ ఇస్తారా అని కోపంతో ఉన్నాడు. అదే కోపంతో పార్సిల్‌ని తీసుకుని వారి ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తలుపు ముందు పార్సిల్ కవర్‌ను పెట్టాడు.

Crime: ఇంట్లో వాళ్లకు తెలియకుండా ప్రియుడిని పెళ్లి చేసుకున్న యువతి.. చివరకు ఈమె పరిస్థితి ఏమైందో తెలిస్తే..!

అయితే అప్పటికే కోపంతో ఉన్న అతను.. వెళ్లే ముందు తన కసి తీసుకోవాలని అనుకున్నాడు. వెళ్లేవాడు వెళ్లకుండా మళ్లీ పార్సిల్ వద్దకు వెళ్లి (delivery boy spat on the parcel cover) అందులో ఉమ్మి వేశాడు. ఇంత తక్కువ ఇస్తారా.. అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ ఘటన మొత్తం వారి ఇంటికి ముందున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అని కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం మహా పాపం’’.. అని మరికొందరు, ‘‘టిప్ తక్కువ ఇచ్చారని.. మరీ ఇలా చేయడం దారుణం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Indian Railway: బోగీని శుభ్రం చేస్తున్న రైల్వే కార్మికుడు.. చెత్తనంతా ఒక్కచోట చేర్చి.. దాన్ని ఏం చేశాడో చూస్తే..!

Updated Date - 2023-09-13T21:55:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising