ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: హోటళ్లలో రోటీలను లొట్టలేసుకుని మరీ తింటున్నారా.. అయితే ఈ వీడియో ఒక్కసారి చూడండి..

ABN, First Publish Date - 2023-01-20T16:28:49+05:30

ఆహార పదార్థాల తయారీలో అపరిశుభ్రత పాటించడం వంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. పానీపూరీ తయారీలో మురుగునీరు వాడటం, హోటళ్లలో గోధుమ పిండిని కాళ్లతో తొక్కడం తదితర ఘటనలకు సంబంధించిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆహార పదార్థాల తయారీలో అపరిశుభ్రత పాటించడం వంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. పానీపూరీ తయారీలో మురుగునీరు వాడటం, హోటళ్లలో గోధుమ పిండిని కాళ్లతో తొక్కడం తదితర ఘటనలకు సంబంధించిన వీడియోలు గతంలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఉమ్మి వేసి రోటీలను తయారు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

Viral Video: ఫొటో తీసుకునేందుకు వందే భారత్ ట్రైన్ ఎక్కాడు.. తర్వాత ఏమైందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఘజియాబాద్ పరిధిలోని ఓ హోటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తసీరుద్దీన్ అనే వ్యక్తి హోటల్లో రోటీలు (Rotis) తయారు చేస్తుంటాడు. కాగా, ఇటీవల ఇతడికి సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. రోటీలు వేస్తుండగా.. వాటిలో ఒక్కోదానిపై ఉమ్మి (spit) వేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రతి రోటీపై అతను ఉమ్మి వేసిన తర్వాతే దాన్ని వేడి చేస్తున్నాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవడంతో హిందూ రక్షా దళ్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు తసీరుద్దీన్‌తో పాటూ హోటల్ యజమానిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు స్పందించి ఈ ఘటనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న యువకుడు.. ప్రియురాలికి జాబ్ రావడంతో బెంగళూరుకు ట్రైన్ ఎక్కించి.. తర్వాత చూస్తే..

యూపీలోని మీరట్, లక్నో పరిధిలో కూడా గతంలో ఇలాంటి తరహా ఘటనలే వెలుగులోకి వచ్చాయి. 2022లో మీరట్‌లో ఓ వ్యక్తి వివాహ వేడుకలో ఉమ్మి వేసి, తందూరి రోటీలను తయారు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ కేసులో హాపూర్‌కు చెందిన ఫిరోజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా 2022లోనే లక్నో పరిధి కోకోరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి.. ఉమ్మి వేసి రోటీలను తయారు చేశాడు. ఈ వీడియో కూడా వైరల్ అవడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Swiggy: ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. భారీ షాకిచ్చేందుకు రెడీ అయిందా..?

Updated Date - 2023-01-20T16:28:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising