ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఆలయంలో వ్యక్తి చేసిన నిర్వాకం.. మహిళను ఈడ్చుకెళ్లి మరీ.. కారణం ఏంటని అడిగితే..

ABN, First Publish Date - 2023-01-06T20:55:15+05:30

కొందరు.. మహిళలు అనే మానవత్వం కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. తమ మాట వినలేదని కొందరు.. తమ దారికి రావడం లేదని మరికొందరు.. తాము చెప్పినట్లే వినాలంటూ ఇంకొందరు.. తరచూ మహిళలపై దాడులు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు.. మహిళలు అనే మానవత్వం కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. తమ మాట వినలేదని కొందరు.. తమ దారికి రావడం లేదని మరికొందరు.. తాము చెప్పినట్లే వినాలంటూ ఇంకొందరు.. తరచూ మహిళలపై దాడులు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవల బెంగళూరుకు చెందిన ఓ మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆలయంలో అంతా చూస్తుండగా ఓ వ్యక్తి.. మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఈడ్చుకెళ్లి మరీ దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..

గ్లాసు నీరు సమర్పించి దేవుడికి పూజలు.. కోరిక నెరవేరకపోవడంతో ఆగ్రహం.. చివరకు ఓ రోజు రాత్రి..

కర్నాటక బెంగళూరులోని (Karnataka Bangalore) అమృతహళ్లిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో (Lakshmi Narasimha Swamy Temple) ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయంలో ఓ మహిళ స్వామిని దర్శించుకునే సమయంలో షాకింగ్ ఘటన (Shocking incident) చోటు చేసుకుంటుంది. ఓ వ్యక్తి అక్కడికి వచ్చి ఆలయం నుంచి బయటికి వెళ్లు.. అని సదరు మహిళను హెచ్చరిస్తాడు. కానీ ఆమె బయటికి వెళ్లకుండా అక్కడే ఉండిపోతుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతను ఆమెపై దాడి (Assault on woman) చేయడమే కాకుండా.. ఈడ్చి కింద పడేస్తాడు. తర్వాత ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తాడు. పక్కనే ఇద్దరు పూజారులతో పాటూ మరో వ్యక్తి కూడా ఉంటాడు. కానీ ఆమెను రక్షించే ప్రయత్నం ఎవరూ చేయరు. అలాగే నిల్చుని చోద్యం చూస్తూ ఉంటారు.

ఎప్పటికైనా నీ భార్యను పెళ్లి చేసుకుంటానంటూ హెచ్చరించిన యువకుడు.. అయినా పట్టించుకోని భర్త.. ఓ రోజు అనుకోకుండా..

కొంత దూరం లాక్కెళ్లాక.. మహిళ పైకి లేచి, మళ్లీ ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో మరింత ఆగ్రహానికి గురైన వ్యక్తి.. ఆమె చేయి పట్టుకుని కిందపడేయడంతో పాటూ ఆలయం వెలుపలికి లాక్కుని వెళ్లిపోతాడు. అయినప్పటికీ ఆమెను రక్షించే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయరు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో (CC camera) రికార్డు అవుతుంది. డిసెంబర్ 21న ఈ ఘటన జరిగినట్లు సమాచారం. బాధితురాలు హేమావతి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై నిందితుడు మునికృష్ణ మాట్లాడుతూ.. స్వామి తన భర్త అని, విగ్రహం పక్కనే కూర్చుంటానని మహిళ చెబుతోందని ఆరోపించాడు. దీంతో మహిళను బయటికి లాక్కెళ్లినట్లు చెప్పాడు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Whatsapp video: సహోద్యోగి భార్యతో అసభ్యకరంగా ఉన్న వీడియోను షేర్ చేసిన కానిస్టేబుల్.. ఒకేసారి వంద మంది చూస్తుండగా..

Updated Date - 2023-01-06T20:55:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising