కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: భయపడుతూనే ఏకంగా మొసలి పక్కనే పడుకున్న వ్యక్తి.. చివరకు అసలు విషయం ఏంట్రా అని ఆరా తీయగా..

ABN, First Publish Date - 2023-06-25T16:37:02+05:30

కళ్లతో చూస్తే గానీ నమ్మలేం అని.. అప్పుడప్పుడూ అంటూ ఉంటాం.. కానీ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో కళ్లతో చూసినా కూడా.. నిజమో కాదో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇంకొన్ని...

Viral Video: భయపడుతూనే ఏకంగా మొసలి పక్కనే పడుకున్న వ్యక్తి.. చివరకు అసలు విషయం ఏంట్రా అని ఆరా తీయగా..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళ్లతో చూస్తే గానీ నమ్మలేం అని.. అప్పుడప్పుడూ అంటూ ఉంటాం.. కానీ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో కళ్లతో చూసినా కూడా.. నిజమో కాదో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇంకొన్ని వీడియోలు చూస్తే.. వామ్మో! ఇదెలా సాధ్యం.. అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి భయపడుతూనే ఏకంగా మొసలి పక్కన పడుకున్నాడు. చివరకు అసలు విషయం ఏంట్రా అని ఆరా తీయగా.. ఏం తెలిసిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. పెద్ద మొసలి (crocodile) నోరు తెరచి ఒడ్డున పడుకుని ఉంటుంది. ఓ వ్యక్తి భయం భయంగానే దాని వద్దకు వెళ్లి.. ఏకంగా దాని పక్కనే పడుకున్నాడు. మొసలి తల అవతలి వైపు ఉండడంతో ఇతన్ని గమనించదు. దీంతో మెల్లగా మొసలి పక్కన పడుకుని.. ‘‘ష్.. గప్‌చుప్.. అరవకండి’’.. అంటూ కెమెరాకు ఫోజ్ ఇస్తాడు. ఆ సమయంలో మొసలి కాస్త గమనించి ఉన్నా అతడి పని ఔట్ అని అందరికీ తెలుసు. కానీ మొసలి మాత్రం ఎంతకీ కదలకుండా అలాగే ఉండిపోతుంది.

Viral news: పొలంలో కాపలా కాస్తున్న ఎలుగుబంటిని చూసి అంతా షాక్.. చివరకు రూ.4,000లతో రైతులు చేసిన పని చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..

అయితే విషయం ఏంటని ఆరాతీయగా.. అది అచ్చం మొసలిలా ఉన్న బొమ్మ (crocodile toy) అని తెలిసింది. అయితే చూడటానికి నోరు తెరచి పడుకున్న మొసలిలాగే ఉండడంతో వీడియో చూసిన వారంతా మొదట ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘అరె! ఇది అచ్చం నిజమైన మొసలిలా ఉందే’’.. అని కొందరు, ‘‘ఇది నిజమైతే అతడి పరిస్థితి ఏంటో’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: చిరుత నుంచి తప్పించుకుని కారు వద్ద సేదతీరుతున్న జింక.. భయంతో చాలా సేపు ఎదురు చూసిన పులి.. చివరకు ఏమైందంటే..

Updated Date - 2023-06-25T16:37:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising